Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై కేసు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   19 Oct 2019 11:04 AM GMT
చంద్రబాబుపై కేసు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
X
ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యేలు కేసు పెట్టారు. గుంటూరు పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్యేలు ముస్తాఫా షేక్ - రజినీ విడుదల - ఉండవల్లి శ్రీదేవీలు ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు, టీడీపీ నేత వర్ల రామయ్య పోలీస్ వ్యవస్థను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని.. అన్ పార్లమెంటరీ భాషలో మాట్లాడుతున్నారని వీరి వ్యాఖ్యల పై కేసు నమోదు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే లు ఫిర్యాదు చేశారు. ఇద్దరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వీరిద్దరి వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని.. డీజీపీని తిట్టారని.. పోలీసులను బెదిరించేలా బాబు మాటలున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

40 ఇయర్స్ పాలిటిక్స్ అని చెప్పుకునే చంద్రబాబు ఆ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు అనంతరం మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితమే చంద్రబాబుపై వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైఎస్ జగన్ ఫ్యామిలీ పై టీడీపీ దుష్ఫ్రచారం చేస్తోందని ఫిర్యాదు చేశారు..తాజాగా మరోసారి చంద్రబాబుపై కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్ గడపతొక్కారు వైసీపీ ఎమ్మెల్యేలు.