Begin typing your search above and press return to search.
కూరగాయలు - శానిటైజర్స్ పంచిన వైసీపీ ఎమ్మెల్యేలు
By: Tupaki Desk | 25 March 2020 3:00 PM GMTదేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రజలు రోడ్లపైకి రాకుండా ఆంక్షలు విధించారు. నిత్యవసరాలు - కూరగాయాల కోసం జనాలు కష్టపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని కొందరు రాజకీయ నేతలు - ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా నిలుస్తున్నారు.
కరోనా వైరస్ విస్తరిస్తున్న వేళ.. తాజాగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తన పెద్ద మనసు చాటుకున్నారు. పేదలకు ఉచితంగా కూరగాయల పంపిణీని ప్రారంభించారు. ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని.. ఇళ్లకే పరిమితం అవ్వాలని సూచించారు. అవసరమైన వారు తన వద్దకు వచ్చి కూరగాయలు ఉచితంగా తీసుకెళ్లాలని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కాకాణి పిలుపునిచ్చారు.
ఇక మరో ఎమ్మెల్యే,విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో శానిటైజర్ బాటిల్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు. అందరికీ అవగాహన కల్పించేందుకు ఇలా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.