Begin typing your search above and press return to search.

మోస‌పు ర్యాంకులు- బాబు నెం.2-మోడీ నెంబ‌ర్‌.1

By:  Tupaki Desk   |   3 Jun 2018 10:18 AM GMT
మోస‌పు ర్యాంకులు- బాబు నెం.2-మోడీ నెంబ‌ర్‌.1
X
క‌నీవినీ ఎరుగని ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో చంద్ర‌బాబు - మోడీ ప్ర‌భుత్వాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయ‌ని వైసీపీ నేత‌లు విశ్లేషించారు. న‌మ్మి నాయ‌క‌త్వం ఇస్తే ఏపీని నిలువునా ముంచిన నేత‌లు ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక నీళ్లు న‌ములుతున్నార‌ని, త‌ప్పించుకు తిరుగుతున్నార‌ని అన్నారు. నెల్లూరులో జరిగిన వంచన గర్జన దీక్షలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆగ‌డాల‌పై వారు తీవ్రంగా మండి ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌లు కొంద‌రు లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌లు ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

చంద్రబాబు 2014 ఎన్నికల హామీల్లో ముఖ్య‌మైన‌వి రైతు రుణమాఫీ - పొదుపు రుణాల మాఫీ - నిరుద్యోగ భృతి - పేదలకు ఇళ్లు... వీటిలో ఏదో ఒక్క‌టి పూర్తిగా అమలు చేసిన‌ట్లు నిరూపిస్తూ తాను వైసీపీకి రాజీనామా చేసి త‌క్ష‌ణం తెలుగుదేశం పార్టీలో చేరిపోతాన‌ని వైసీపీ ఎమ్మెల్యే వేసిన ప్ర‌శ్న‌కు జ‌నాలు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తంచేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రావ‌డానికి 600 హామీలిచ్చారు. వాటిలో ఏ ఒక్కటీ సంపూర్ణంగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు - ఆయ‌న తెలివైన వాడే కానీ... ఆ తెలివితే జ‌నాల‌కు మేలు చేయ‌డం మానేసి వారిని వంచించ‌డానికి త‌న తెలివితేట‌లు వాడుతున్నార‌ని దులిపేశారు. బాబు మాట‌లు జ‌నాల చెవుల్లో ఇంకా గిర్రున తిరుగుతున్నాయ‌ని, వాటి ఫ‌లితం చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్షంగా చూస్తార‌న్నారు.

ప్రజలను మోసగించడంలో నెంబర్‌ వన్ ర్యాంకు మోదీకి, నెంబర్ 2 ర్యాంకు చంద్ర‌బాబుకు ద‌క్కుతాయ‌ని అంబ‌టి రాంబాబు వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ లేక‌పోతే ఈపాటికి ప్ర‌త్యేక హోదాకు ఎపుడో చంద్ర‌బాబు స‌మాధి క‌ట్టేసేవార‌ని రాంబాబు విమ‌ర్శించారు. చంద్ర‌బాబు 40 ఏళ్ల అనుభవం ఆయ‌న పార్టీని కాపాడుకోవ‌డానికి, కొడుక్కి అడ్డ‌దారిలో ప‌దవులు ఇవ్వ‌డానికి త‌ప్ప దేనికీ ప‌నికిరావ‌డంలేద‌ని కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అన్నారు.

జేసీ దివాక‌ర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు వైసీపీ నేత‌లు మండిప‌డ్డారు. వైసీపీ నేత జ‌గ‌న్‌పై దివాక‌ర్‌ రెడ్డి మాట‌లు ఆయ‌న దిగజారుడుత‌నాన్ని సూచిస్తున్నాయ‌న్నారు. వచ్చే ఎన్నికల్లో జెసి బ్రదర్స్ కు బుద్ధి చెప్ప‌డానికి ప్రజలు వేచి చూస్తున్నారని చెప్పారు. ఈ స‌భ‌కు సినీ నటులు పృథ్వీ - విజయ్‌ చందర్ కూడా హాజ‌ర‌య్యారు. సినీ రంగం జ‌గ‌న్ వైపు ఉంద‌ని జ‌గ‌న్ వైపు నిల‌వ‌డం అంటే ప్ర‌జ‌ల వైపు నిల‌వ‌డ‌మే అన్నారు.