Begin typing your search above and press return to search.

వైఎస్ ఆర్ ను మ‌రిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు - వైసీపీ సోష‌ల్ మీడియా!

By:  Tupaki Desk   |   29 Jan 2020 4:44 AM GMT
వైఎస్ ఆర్ ను మ‌రిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు - వైసీపీ సోష‌ల్ మీడియా!
X
మండ‌లి ర‌ద్దు గురించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందిస్తూ ఉంది. మండ‌లి ర‌ద్దును గ‌ట్టిగా స‌మ‌ర్థిస్తూ ఉంది. అందులో త‌ప్పేం లేదు. ప్ర‌జల చేత ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌కు మండ‌లి అడ్డుప‌డుతూ ఉంద‌ని, అందుకే మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్టుగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం చెబుతూ ఉంది. మండ‌లిలో తెలుగుదేశం పార్టీ మెజారిటీతో ఉండ‌టంతో.. ప్ర‌భుత్వం తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం ల‌భించ‌డం లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి ప‌చ్చ‌చొక్కాల వాళ్లు - ప్ర‌జ‌ల చేత తిర‌స్క‌రించ‌బ‌డిన వాళ్లు మండ‌లిలో కూర్చుని ప్ర‌జ‌ల చేత ఎన్నుకున్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను స‌వాల్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకుని.. దాన్ని ఆమోదించింది జ‌గ‌న్ కేబినెట్. ఆపై అసెంబ్లీ కూడా దాన్ని ఆమోదించింది. ప్ర‌స్తుతానికి అది కేంద్రానికి వెళ్లిన‌ట్టే. ఇక కేంద్రం ఆమోదం పొందితే మండ‌లి ర‌ద్దు అవుతుంది.

అంత వ‌ర‌కూ బాగానే ఉంది కానీ, మండ‌లి వ‌ద్దంటూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వేర్వేరు వాద‌న‌ల‌ను కూడా వినిపిస్తూ ఉంది. మండ‌లిని గ‌తంలో ఎవ‌రెవ‌రు వ‌ద్ద‌న్నారో చెబుతూ ఉంది. అయితే ఆ వాద‌న‌లు అన్నీ ఇప్పుడు అవ‌స‌రం లేదు. ప్ర‌జా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను లోకేష్ లాంటి ఎమ్మెల్యేగా ఓడిన వాళ్లు అడ్డుకుంటున్నారు.. అందుకే మండ‌లి ర‌ద్దు అంటే స‌రిపోతుంది. అయితే వైసీపీ మండ‌లి వ‌ద్దంటూ ఎవ‌రో మేధావుల‌ను కోట్ చేస్తూ ఉంది. వారు మండ‌లి వ‌ద్దు అని ఉండ‌వ‌చ్చు గాక‌ - అయితే ఏపీలో మండ‌లిని ఏర్పాటు చేసింది సీఎంగా వైఎస్ ఆర్ ఉన్న‌ప్పుడే అనేది గ‌మ‌నించాల్సిన అంశం.

ముఖ్య‌మంత్రిగా వైఎస్ ఎన్నిక‌య్యాకా.. మండ‌లిని ఏర్పాటు చేశారు. అప్ప‌టికి రెండు ద‌శాబ్దాల కింద‌టే ర‌ద్దు అయిన మండ‌లిని వైఎస్ పున‌రుద్ధ‌రించారు. అప్పుడు రాజ‌శేఖ‌ర రెడ్డి ప్ర‌భుత్వం మండ‌లిని ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేయ‌డం - దాన్ని కేంద్రం ఆమోదించ‌డంతో మండ‌లి ఏర్పాటు అయ్యింది. మ‌రి ఆ విష‌యాన్ని గ్ర‌హించ‌కుండా.. మండ‌లి వ‌ద్దంటూ కొంద‌రు మేధావుల వ్యాఖ్య‌ల‌ను వైసీపీ కోట్ చేస్తూ ఉంది. ఇలా వైఎస్ ను విస్మ‌రిస్తున్న‌ట్టుగా వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తూ ఉంది.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇలానే మాట్లాడుతూ ఉన్నాడు - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్ బుక్ పేజీలోనూ ఈ త‌ర‌హాలోనే పోస్టు చేశారు. మండ‌లిని మేధావులు వ‌ద్ద‌న్నార‌ని అంటున్నారు. వైసీపీకి ఇలాంటి వ్యూహాత్మ‌క‌ లోపాలు కొత్త ఏమీ కాదు. తాము చెప్ప‌ద‌లుచుకున్న అంశాల‌ను సూటిగా చెప్ప‌డంలో - త‌మ అజెండాను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా త‌డ‌బ‌డుతూ ఉండ‌టం ఇక‌నైనా మానుకుంటే మంచిదేమో!