Begin typing your search above and press return to search.
గుంటూరు వైసీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే... కారణం తహసీల్దార్...!
By: Tupaki Desk | 5 Oct 2021 8:00 AM ISTఏపీలో అధికార వైసీపీలో గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. ఎవరో ఒకరిద్దరు మినహాయిస్తే దాదాపు అందరూ ఎంపీలకు ఎమ్మెల్యేలతోనో, మంత్రులతోనే పడడం లేదు. తాజాగా రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లాలో ఓ మండల తహసీల్దార్ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ మధ్య తీవ్రమైన వార్ జరుగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య యేడాదిన్నర కాలంగా రాజకీయంగా ఆధిపత్య పోరు నడుస్తుండగా.. ఇప్పుడు చిన్న తహసీల్దార్ పోస్టు విషయంలోనూ ఇద్దరూ పంతాలకు పోవడంతో యుద్ధం మామూలుగా లేదు.
అసలు విషయానికి వస్తే ఆ ఎమ్మెల్యే ప్రాథినిత్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఏ మండలంలో కూడా ఆ తహసీల్దార్ ఉండకూడదని పట్టుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది నెలలుగా ఆ ఎమ్మెల్యే ఎన్నో లేఖలు రాసి.. పట్టుబట్టి మరీ ఆ తహసీల్దార్‌ను బదిలీ చేసే ప్రయత్నం చేశారు. తాజాగా తహసీల్దార్ డిప్యూటేషన్ బదిలీ ఆర్డర్స్ వచ్చాయి. అయితే అవి అమలు జరగకుండా ఆ ఎంపీ తీవ్ర స్థాయిలో అడ్డుకుంటున్నారు.
దీంతో అధికార పార్టీలోని సదరు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వార్ ఇప్పుడు రసవత్తరంగా మారింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడక ముందు జిల్లాలో ఆ మండలంలో భూముల ధరలు టాప్ రేంజ్లో ఉండేవి. అక్కడ ఒక్కో ఎకరం రు. 2 కోట్లు పై మాటే అన్నట్టుగా ఉండేది. అయితే ఇప్పుడు రాజధానిని వికేంద్రీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ మండలంలోని భూముల రేట్లు చాలా వరకు తగ్గిపోతున్నాయి. అయితే ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే మళ్లీ అక్కడ రియల్ భూమ్ వస్తుందన్న ఆశలు అధికార పార్టీ నేతల్లోనే ఎక్కువుగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఆ తహసీల్దార్ ఎమ్మెల్యే చెప్పిన పనులు చేయకుండా.. ఆ ఎమ్మెల్యేను లెక్క చేయడం మానేశారు. దీంతో పట్టుబట్టి తహసీల్దార్‌ను బదిలీ చేసేందుకు చేసిన ప్రయత్నంతో కలెక్టర్ వివేక్ యాదవ్ డిప్యూటేషన్ పేరుతో బదిలీ చేసి అక్కడ మరొకరికి బాధ్యతలు ఇచ్చారు. అయితే ఎంపీ తీవ్రమైన ఒత్తిళ్లతో కలెక్టర్ ఆర్డర్సే అమలుకు నోచుకోవడం లేదు. అయితే ఎంపీకి సంబంధం లేక పోయినా తన నియోజకవర్గంలో జోక్యం ఏంటని ఎమ్మెల్యే అధిష్టానానికి కంప్లెంట్ చేసినట్టు తెలిసింది.