Begin typing your search above and press return to search.
సోషల్ మీడియా అంటే ఏంటి - వైసీపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 15 Dec 2020 12:00 PM ISTఏ పార్టీకైనా ప్రస్తుతం సోషల్ మీడియా విభాగమే చాలా కీలకం. అందులోను అధికారపార్టీలంటే చెప్పాల్సిన పనేలేదు. ఒకవైపు ప్రభుత్వ నిర్ణయాలను, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే శక్తవంతమైన మాధ్యమం సోషల్ మీడియానే. ఇదే సమయంలో పార్టీ వ్యవహారాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేది కూడా సోషల్ మీడియానే. 2014లో టీడీపీ అధికారంలోకి రావటంలో అప్పటి సోషల్ మీడియా ఎంతటి కారణమైందో అందరికీ తెలిసిందే.
అదేపద్దతిలో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావటానికి కూడా ఇదే సోషల్ మీడియానే పాత్ర చాలా కీలకమైంది. ప్రస్తుతం దేశం మొత్తం మీద సోషల్ మీడియా విభాగాలు బాగా బలంగా ఉన్న పార్టీలేవైనా ఉన్నాయంటే అది బీజేపీ, వైసీపీలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సీఎంను చేయాలన్న టార్గెట్ పెట్టుకుని వేలాదిమంది సోషల్ మీడియా గ్రూపులు నడిపారు. వాళ్ళంతా స్వచ్చందంగా జగన్ పై ఉన్న అభిమానంతోనే వాలంటీర్లలాగ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా పదేళ్ళు గా పనిచేస్తున్నారు.
ఇతంటి బలమైన వ్యవస్ధ వైసీపీ అధికారంలోకి రాగానే బలహీనపడుతున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. కారణం ఏమిటంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా పనిచేసిన వాళ్ళను అధికారపార్టీ ఎంఎల్ఏలు, నేతలు అస్సలు గుర్తించటం లేదట. ఈ విషయంలో నిర్భయంగా వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలోనే పోస్టులు పెట్టేస్తున్నారు. దాంతో ఇటువంటి అనేక పోస్టులు వైరల్ గా మారి చివరకు రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి దృష్టకి వెళ్ళింది. దాంతో ఈ విషయాన్ని ఎంపి స్వయంగా టేకప్ చేశారు.
ఇందులో భాగంగానే ఈమధ్యనే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేవాళ్ళతో ఎంపి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఆయా జిల్లాల్లోని ఎంఎల్ఏలను ప్రత్యేకంగా పిలిపించుకుని వాళ్ళు ఏదైనా పనుల మీదొస్తే చేసిపెట్టమని చెప్పారు. అయితే ఎంఎల్ఏల్లో కొందరు ఇంకా సోషల్ మీడియా యాక్టివిస్టులను పట్టించుకోవటం లేదట. ప్రకాశం జిల్లా ఎంఎల్ఏ ఒకరు అసలు సోషల్ మీడియా అంటే ఏంది అని మొహంమీదే అడిగేశారట. దాంతో సోషల్ మీడియా విభాగం వాళ్ళు బిత్తరపోయారు.
రాత్రికి రాత్రి పార్టీ మారిన ఈ ఎంఎల్ఏ వైసీపీ తరపున పోటీ చేసి గెలవటంతో సోషల్ మీడియానే కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేసినా పట్టించుకోలేదట. అలాగే తిరుపతిలోని ఓ మహిళా యాక్టివిస్టు ఈమధ్య అమరావతిలో ఓ మంత్రి పేషీకి వెళితే చాలా అవమానం జరిగిందట. మంత్రి పేషీ వాళ్ళు తనకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని ఆమె నేరుగానే ఫేస్ బుక్ లో తన ఆవేధనను చెప్పుకున్నారు. విచిత్రమేమంటే ఆమె ఆవేధనకు మద్దతుగా చాలామంది తమ అనుభవాలను కూడా షేర్ చేసుకోవటం. తమకెదురవుతున్న అనుభవాలను యాక్టివిస్టులు పబ్లిక్ గా సోషల్ మీడియాలో పంచుకుంటున్న కారణంగా పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా డ్యామేజి జరగక తప్పేట్లు లేదు.