Begin typing your search above and press return to search.
మందు - పొట్టెళ్లు - కోడి కోసమే పాదయాత్ర చేస్తా మీ ఊరిలో: వైసీపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 17 Nov 2020 11:53 PM ISTఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు.. ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఆదేశించిన పాదయాత్రలు ఆ వైసీపీ ఎమ్మెల్యేకు గుదిబండగా మారాయట.. జనాల్లో ఫెయిత్ లేని ఎమ్మెల్యే పిలుపునకు జనాలు కాదు కదా ఈగలు కూడా రాకపోవడంతో చేసేందేం లేక కార్యకర్తలతో మందు, విందులు ఏర్పాటు చేసి జనాలను తీసుకొచ్చి పాదయాత్ర ప్రోగ్రాంను మమ అనిపిస్తున్నాడట.. అయినా జనాలు రాకపోతే ఇక మార్ఫింగ్ చేసి జనాలు వచ్చినట్టు ఫొటోలు, వీడియోలు సృష్టించి కార్యక్రమాన్ని కవర్ చేశాడట.. ఆ ఎమ్మెల్యే పరిస్థితి పగోడికి కూడా రాకూడదని అక్కడి నేతలు చెవులు కొరుక్కుంటున్నారట..
ఏపీ సీఎం జగన్ పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఎమ్మెల్యే, ఇన్ చార్జి 10 రోజులు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ పిలుపునకు కొందరు ఎమ్మెల్యేలు స్పందించారు. కొందరూ తూతూ మంత్రంగా కానిచ్చేశారట.. అయితే ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే నిర్వహించిన పాదయాత్రకు జనాలు రావడం లేదు అని హైకమాండ్ నుంచి క్లాస్ గట్టిగా ఇచ్చారట.. దీంతో సదురు ఎమ్మెల్యే వైసీపీ కార్యకర్తలకు హుకూం జారీ చేశారట.. ‘జనాలు రావాలంటే మందు, పొట్టేళ్లు, కోళ్లను కోయండని.. అప్పుడే మన కార్యక్రమాలకు జనాలు వస్తారని..’ గ్రామ నాయకులకు ఆదేశాలు జారీ చేశారట..
అయితే దీనిపై గ్రామ నాయకులు షాక్ అయ్యారట.. ప్రభుత్వం నుంచి తాము ఏమీ లబ్ది పొందలేదని మేం ఎందుకు ఖర్చు పెట్టాలని వారంతా అంటే.. ఎమ్మెల్యే గారు ఒప్పుకోలేదట.. ‘రేపు బిల్స్ రావాలంటే.. స్థానికసంస్థల ఎన్నికల్లో సీట్లు రావాలంటే ఇలా చేయక తప్పదని.. మందు, పొట్టేళ్లు, కోళ్ల కోసం ఖర్చు పెట్టాలని.. లేకపోతే జనాలు రారు అని.. జనాలు రాకపోతే సాయంత్రం హైకమండ్ నుంచి క్లాస్ తీసుకుంటారని ’ గ్రామ నాయకులకు సదురు వైసీపీ ఎమ్మెల్యే హుకూం జారి చేస్తున్నారంట..
ఆ ఎమ్మెల్యే ఎంత ప్రయత్నించినా గ్రామాల్లోంచి ప్రజలు.. లబ్ధిదారులు రావడం లేదట.. దీంతో మండలాల నుంచి 20 వార్డుల నుంచి ప్రతిరోజు కార్లు పెట్టి.. అందులో జనాలను తీసుకొని వెళ్లి.. వాళ్లతో సందుల్లో ఫొటోలు తీయించి.. వీడియోలను లాంగ్ షాట్ లో తీయించి.. వాటిని జనాలు ఉన్నట్టు మార్ఫింగ్ వీడియోలు తయారు చేయించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారట..
ఈ వీడియోలు చూసిన అక్కడి జనాలు ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోతున్నారట.. అసలు జనాలే రాకపోతే ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారని సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారి మార్ఫింగ్ ప్రతిభకు షాక్ కు గురవుతున్నారట.. ఇది జగన్ పాదయాత్ర విజయవంతానికి ఆ ఎమ్మెల్యే పడుతున్న తంటాల పరిస్థితి అని అక్కడి జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
అక్కడ వైసీపీకి మంచి పలుకుబడి ఉంది కానీ.. ఎమ్మెల్యే మీద వ్యతిరేకతతో జనాలు రావడం లేదు అని లోకల్ రాజకీయ నాయకులు అంటున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల కోసం చేస్తున్న వేశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయట..