Begin typing your search above and press return to search.

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల డిమాండ్ తగ్గిందట

By:  Tupaki Desk   |   2 Jan 2022 11:00 PM IST
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల డిమాండ్ తగ్గిందట
X
కొత్త ఏడాది.. అందునా జనవరి ఒకటో తేదీ వచ్చిందంటే చాలు.. తమ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల్ని పెద్ద ఎత్తున కలవటం.. వారిని శుభాకాంక్షలు చెప్పటం.. వారికి పండ్లు.. పూలబొకేలు.. స్వీట్లు.. ఇలా తమకు తోచిన బహుమానాలు ఇచ్చి.. వారి ఆశీస్సులు తీసుకోవటం కనిపిస్తుంది. అధికారులు.. చోటా నేతలతో పాటు.. నియోజకవర్గానికి చెందిన పలువురు పెద్ద ఎత్తున వెళ్లటం సహజం. అందుకు భిన్నమైన సీన్ తాజాగా ఏపీలో చోటు చేసుకుందన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసింది.

ఎందుకంటే.. ఈ జనవరి ఒకటో తేదీన వైసీపీ ఎమ్మెల్యే ఇళ్ల వద్ద కానీ.. క్యాంప్ ఆఫీసు వద్ద కానీ పెద్దగా సందడి లేకపోవటం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అధికారపక్ష నేతలకు తగ్గిన పలుకుబడికి ఇదో నిదర్శనంగా చెబుతున్నారు. ఎందుకంటే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయం కాన్సెప్టును తీసుకురావటం.. పెద్ద ఎత్తున సచివాలయ కార్యదర్శల్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. గ్రామస్థాయి నుంచి ఏపీ వ్యాప్తంగా ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా.. చిన్న చిన్న అవసరాలకు గ్రామ సచివాలయానికి వెళ్లటమే తప్పించి.. స్థానిక నేతల్ని.. మరి ముఖ్యంగా ఎమ్మెల్యేల్ని కలిసే అవకాశం తగ్గిపోయిందని చెబుతున్నారు.

గతంలో ఏ పని అవసరమైనా ఎమ్మెల్యే వద్దకు వెళ్లటం.. అక్కడి నుంచి ఫోన్లు చేయించుకొని స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పనులు చేయించుకునే వారు. ఇప్పుడు అందుకు భిన్నమైన సీన్ చోటుచేుకుంది. దీంతో.. ఎమ్మెల్యే కంటే కూడా సచివాలయ సిబ్బంది అవసరమే ప్రజలకు ఎక్కువగా మారిందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ఎమ్మెల్యేల పలుకుబడి ఎంతలా తగ్గిందనటానికి ఇదో నిదర్శనమన్న మాట వినిపిస్తోంది. ఇదే విషయాన్ని జనవరి ఒకటో తేదీ నిరూపించిందని చెప్పాలి.