Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే రోజా చెప్తోంది నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   30 Oct 2018 5:27 AM GMT
ఎమ్మెల్యే రోజా చెప్తోంది నిజ‌మేనా?
X
న‌టుడు శివాజీ ఇటీవ‌ల రాజ‌కీయాల్లో యాక్టివ్‌ గా ఉన్న విష‌యం తెలిసిందే. ఆప‌రేష‌న్ గ‌రుడ పేరిట అత‌ని అంద‌రి నోళ్ల‌లో నానుతున్నారు. అయితే, ఈ ఆప‌రేష‌న్ గ‌రుడ గురించి తెలుగు ప్ర‌జ‌ల్లో చాలా అపోహ‌లు ఉన్నాయి. ఒక సాధార‌ణ న‌టుడికి ముఖ్య‌మంత్రుల‌కు కూడా తెలియ‌ని స‌మాచారం ఎలా తెలుస్తుందో అర్థం కావ‌డం లేదు. అయితే, చంద్ర‌బాబు పాల‌న‌లో విఫ‌లం అయ్యామ‌ని గుర్తించిన వెంటనే మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డానికి ఈ కొత్త రాజ‌కీయ క్రీడ‌ను ఆడుతున్నార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో జ‌నాల్ని దృష్టి మ‌ళ్లించ‌డ‌మే దీని లక్ష్యం. ముఖ్యంగా పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌ కు వ‌స్తున్న అపూర్వ స్పంద‌న చంద్ర‌బాబు నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. దీంతో పాల‌న మ‌రిచి పాచిక‌లు వేయ‌డం మొద‌లుపెట్టారు చంద్ర‌బాబు.

విశాఖ‌లో జ‌రిగిన దాడిపై టీడీపీ నేత‌ల స్పంద‌న చాలా విచిత్రంగా ఉంటోంది. డీజీపీ పోలీసుల మాట‌కు-టీడీపీ నేత‌ల మాట‌ల‌కు-మీడియా మాట‌ల‌కు ఎక్క‌డా సింక్ అవ్వ‌డం లేదు. దీన్ని బ‌ట్టే ఇది ఒక వ్యూహాత్మ‌క రాజ‌కీయ క్రీడ అని అర్థం చేసుకోవాల్సి వ‌స్తోంది. దీనిపై ఎమ్మెల్యే రోజా కొన్ని అనుమానాలు వ్య‌క్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌ లోనే ఆపరేషన్ గరుడ సాగుతోందని - గతంలో శివాజీ కేబినెట్ మీటింగ్‌ లో పాల్గొనడమే దీనికి నిదర్శనమని విమర్శించారు. శివాజీ భయపడి అమెరికా పారిపోయారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. మొన్న‌టికి మొన్న శివాజీ జ‌గ‌న్ బాగా క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ని ఏదో ఒక‌రోజు సీఎం అవుతార‌ని చేసిన వ్యాఖ్య‌లు కూడా కేవ‌లం త‌న‌మీద ప‌డుతున్న తెలుగుదేశం ముద్ర‌ను క‌ప్పిపుచ్చ‌డానికే అయిఉంటుంద‌ని అంటున్నారు. ఎందుకంటే ఆ మాట అన్న రెండు మూడు రోజుల్లేనే శివాజీ మాట మార్చారు. *గుమ్మ‌డికాయ‌ల దొంగ అంటే భుజాలు త‌డుముకుంటున్నారు. వైసీపీ రాష్ట్రపతి పాలన పెట్టాలని ఎందుకు అడిగింది? కేంద్రం మీ చేతుల్లోనే ఉందని అందరూ అనుకుంటున్నారు. మీ ఇష్టం వచ్చిన దర్యాప్తు చేయండి’’ అని శివాజీ వీడియోలో అన్నారు.

అధికారంలో ఉన్న బీజేపీతో స్థానిక టీడీపీ స‌ర్కారు ఇంత‌కాలం చేతులు క‌లిపింది. కానీ వైసీపీ ఏనాడూ బీజేపీతో లేదు. ఇవ‌న్నీ తెలిసి కేంద్రం మీ చేతుల్లోనే ఉంద‌ని శివాజీ వైసీపీపై ఆరోప‌ణ‌లు చేయ‌డం అచ్చం టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌ల్లానే ఉన్నాయి. పైగా ఎపుడైతే శివాజీ అరెస్టుకు వైసీపీ నేత‌లు డిమాండ్ చేశారో అపుడే శివాజీ అమెరికా వెళ్ల‌డం మ‌రిన్ని అనుమానాల‌కు తావిస్తోంది.