Begin typing your search above and press return to search.

60: 40 శాతం ఎమ్మెల్యే అడ్డం తిరిగాడా?

By:  Tupaki Desk   |   2 Nov 2020 5:00 PM IST
60: 40 శాతం ఎమ్మెల్యే అడ్డం తిరిగాడా?
X
‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. బోల్తా పడ్డాడులే ఆ టీడీపీ ఇన్ చార్జి’ అని ఆ నియోజకవర్గంలో నేతలు పాటలు పాడుకుంటున్నారట.. వైసీపీ ఎమ్మెల్యే నిజస్వరూపం చూసి నోట మాట రాని పరిస్థితి ఆ టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జిదట.. గత చంద్రబాబు ప్రభుత్వంలో పాలునీళ్లలా కలిసిపోయారు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే - వైసీపీ ఇన్ చార్జి. కానీ జగన్ పాలన వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. దీంతో గొల్లుమనడం టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి వంతైంది.. నమ్మి సాయం చేసిన టీడీపీ ఇన్ చార్జి ఇప్పుడు నిండా మునిగి నెత్తిన తడిగుడ్డతో తెగ బాధపడుతున్నాడట..

2014 ఎన్నికల్లో వైసీపీ తరుఫున కూడా ఆ ఎమ్మెల్యే గెలిచాడు. అయితే అప్పుడు వైసీపీ అధికారంలో లేదు. అప్పుడున్న టీడీపీ ఇన్ చార్జి వైసీపీ ఎమ్మెల్యే ఇద్దరూ కుమ్మక్కు అయ్యి పనులు కమీషన్ లో పంచుకున్నారన్న ప్రచారం ఉంది. టీడీపీ ఇన్ చార్జికి 60శాతం.. వైసీపీ ఎమ్మెల్యేకి 40శాతం అని మాట్లాడుకొని పనుల్లో కమిషన్ తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు అన్ని పనులు సాఫీగా జరిగిపోయాయని టాక్.

అయితే ఇప్పుడు అదే ఎమ్మెల్యే వైసీపీ తరుఫున మళ్లీ గెలిచాడు. సేమ్ ఫార్ములా అమలు చేద్దామని ఆ టీడీపీ ఇన్ చార్జి అంటే అధికార వైసీపీ ఎమ్మెల్యే ససేమిరా ఒప్పుకోవడం లేదట.. నీకు ఒక పర్సంట్ కూడా ఇవ్వను అంటున్నాడని.. టీడీపీ ఇన్ చార్జి తన మనుషుల దగ్గర వాపోతున్నాడట..

అయితే కొందరు 20శాతం కమీషన్ ఇచ్చి ఇదే వైసీపీ ఎమ్మెల్యే దగ్గర పనులు చేసుకుంటున్నారంట.. టీడీపీ ఇన్ చార్జి అంత కమీషన్ ఇవ్వకపోవడంతో ఆయనను పక్కనపెట్టాడట.. అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు కాబట్టి.. వాళ్లది అధికారంలో ఉన్నారు కాబట్టి నేను వాళ్లతో కాంప్రమైజ్ అయ్యానని.. ఇప్పుడు నేనే ఎమ్మెల్యే నాదే అధికారికం కావడంతో నేను సదురు టీడీపీ ఇన్ చార్జికి ఇచ్చేది లేదని వైసీపీ ఎమ్మెల్యే తెగేసి చెప్తున్నాడట..

దీంతో సదురు టీడీపీ ఇన్ చార్జి అవాక్కయ్యాడట.. వాళ్ల మనుషులు కూడా ఆ ఇన్ చార్జినే తిడుతున్నారట.. మనం అనవసరంగా గత ప్రభుత్వంలో వైసీపీ ఇన్ చార్జికి పనులు ఇచ్చామని.. ఇప్పుడు ఇలా అడ్డం తిరుగుతాడు అనుకోలేదని అక్కడ నాయకులు గొల్లుమంటూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట..