Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే కి తప్పిన ప్రమాదం .. కాన్వాయ్‌ లోని వాహనం బోల్తా !

By:  Tupaki Desk   |   25 Jan 2020 12:45 PM IST
వైసీపీ ఎమ్మెల్యే కి తప్పిన ప్రమాదం .. కాన్వాయ్‌ లోని వాహనం బోల్తా !
X
చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కాన్వాయ్‌ లోని ఒక ఎస్కార్ట్ వాహనం బోల్తాపడింది. పుత్తూరు మండలంలోని పరమేశ్వర మంగళం వద్ద ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదం లో ఆ వాహనం లో ఉన్న సిబ్బందికి గాయాలయ్యాయి. దీనితో వెంటనే బాధితుల్ని తిరుపతిలోని ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద సమయం లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఎస్కార్ట్‌ కారు కు ముందు వాహనం లో ఉన్నట్టు తెలుస్తుంది. చెవిరెడ్డి కాన్వాయ్ లోని ఒక వాహనం బోల్పాపడిందని తెలుసుకున్న స్థానికులు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, ఆ వాహనాన్ని పక్కకు తీసి, గాయ పడ్డ వారిని ఆస్పత్రి కి తరలించారు. క్షతగాత్రులన్ని దగ్గరుండి ఆస్పత్రికి తరలించే వరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి దగ్గర ఉన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ వాహనానికి ముందున్న వాహనంలో ఉండటం తో ఆయన కు పెద్ద ప్రమాదం తప్పి పోయింది. వాహనం బోల్తా పడటంతో ఆ మార్గంలో కొద్దిసేపు వాహనాల రాక పోకలు నిలిచిపోయి.