Begin typing your search above and press return to search.
న్యాయమూర్తుల ఎంపిక విధానం మారాలి: చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 24 March 2022 7:11 PM ISTఏపీలో అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో న్యాయవ్యవస్ధ పనితీరు, పరిమితు లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యా యమూర్తులు తమ తీర్పులు బాధ్యతాయుతంగా ఇవ్వాలని, వారి ఎంపిక విధానం కూడా మారాలని చెవి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తీర్పులు చెప్పేవారు.. మరింత జాగ్రత్తగా ఉండాలని చెవిరెడ్డి సూచిం చారు. మరెవరూ తమపై వేలెత్తి చూపకుండా అత్యంత బాధ్యతగా మెలగాలన్నారు.
న్యాయనిపుణులు ఏ బెంచ్ కు ఏ కేసు వెళితే చెబితే మేం చెప్పగలమంటూ ప్రజలు, న్యాయవాదులు మాట్లాడుకూనే పరిస్ధితులు రాకూడదని కోరుకుంటున్నానని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టాలే కానీ చుట్టూ ఉన్న వ్యవస్ధల్ని నిర్వీర్యం చేసి, తమ బలాన్ని పెంచుకోవాలన్న ధోరణి సరికాద ని చెవిరెడ్డి హితవు పలికారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్ధలపై పెత్తనం చేయడం ద్వారా,వారి గౌరవం తగ్గించడం ద్వారా తాను బలపడాలన్న పద్ధతి ప్రజాస్వామ్యయుతం కాదన్నారు.
శాసన, కార్యనిర్వాహక వ్యవస్ధల పట్ల న్యాయస్ధానానికి గౌరవం లేకపోతే ప్రజాస్వామ్యం నిలబడుతుందా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. చీటికీ మాటికీ వాటి పనితీరులో జోక్యంచేసుకుంటే వాటి పనితీరు రాజ్యాంగ స్ఫూర్తిగా నిలబడుతుందా అని నిలదీశారు. ప్రజల నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాగా పనిచేస్తే తిరిగి ఎన్నికవుతారని, లేకపోతే ప్రజలు వారిని ఇంటికి పంపుతారని చెవిరెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీ. కానీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాల్సిన న్యాయమూర్తులు, చట్టసభలు చేసే చట్టాలపై తీర్పులు వెలువరించే న్యాయమూర్తులు ఎవరికి జవాబుదారీ అని ప్రశ్నించారు.
వారి నైతికతను నిర్దేశించేది ఎవరు? వృత్తిపరంగా నైపుణ్యాలు ఉన్నాయో లేదో నిర్ధారించేది ఎవరు? అని వీరప్ప మొయిలీ కమిషన్ ప్రశ్నించిందని చెవిరెడ్డి గుర్తుచేశారు. సుప్రీం, హైకోర్టు జడ్డీలకు నైతిక నియమావళి ఉండాలని, తప్పులు చేస్తే జరిమానాలు విధించాలని, ప్రత్యేక సందర్భాల్లో న్యాయమూర్తు ల్ని తొలగించే అధికారం రాష్ట్రపతి ఆధ్వర్యంలోని వ్యవస్ధకు ఉండాలని 92వ రాజ్యాంగ సవరణ ద్వారా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశారని వెల్లడించారు.
ఇవాళ న్యాయస్ధానాల్లో పరిణామాలు చూశాక మోడీ సర్కార్ కూడా జాతీయ న్యాయకమిషన్ కు నిర్ణయా త్మక పాత్ర కల్పిస్తూ చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేసిందని చెవిరెడ్డి తెలిపారు. దేశంలో పాలనకు ప్రాణాధారంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ లకు యూపీఎస్సీ ఎన్నో పరీక్షలు పెట్టి ఎంపిక చేస్తోందన్నారు.. చట్టాల రాజ్యాంగ బద్ధతపై తీర్పులు చెప్పే జడ్డీల ఎంపిక మరింత కఠినంగా ఉండాలన్నారు. యూపీఎస్సీ తరహాలోనే జడ్డీల నియామకం కూడా పారదర్శకంగా, జవాబుదారీతనంగా చేపట్టాల్సిన అవసరం వస్తుందని న్యాయవాదిగా ప్రతిపాదిస్తున్నట్లు చెవిరెడ్డి తెలిపారు.
కొలీజియం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దేశంలో అన్ని వ్యవస్ధల నియంత్రణకు వ్యవస్దలు ఉన్నాయి. ఐపీసీ, సీఆర్పీసీ నిబంధనల గురించి ప్రజలకు అంతగా అవగాహన ఉండదన్నారు. కోర్టుల భుజంపై తుపాకీ పట్టి కాల్చాలన్న విపక్షాల ఉద్దేశాన్ని కోర్టులు గుర్తించాల్సిన అవసరం ఉందని చెవిరెడ్డి తెలిపారు. జస్టిస్ చంద్రు ఏపీలో ఏం జరుగుతోందో చూడాలన్నారు. ఇక్కడి ప్రభుత్వం న్యాయస్ధానాలతో నిత్యం పోరాటం చేయాల్సి వస్తోందని చెప్పడం గమనించాలన్నారు.
కోర్టులకు స్వీయనియంత్రణ అవసరమని దశాబ్దాలుగా బుద్ధి జీవులు చెప్తున్నారని, ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగవ్యతిరేకతమైతే కోర్టులు దాన్ని కొట్టేయవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతుంది దానికి విరుద్ధంగా ఉందన్నారు.. కోర్టులు స్వయంగా పూనుకుని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటే ఇక ప్రభుత్వాలు చేసేదేముంది ? కోర్టులు తాము తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాలకు ఎవరికి జవాబుదారీగా ఉంటాయి . అన్ని వ్యవస్ధల్లాగే కోర్టులకూ పరిమితులు ఉన్నాయనేది కోర్టులు తెలుసుకోవాలన్నారు.