Begin typing your search above and press return to search.
అక్కడ వైసీపీ మాస్టర్ ప్లాన్... ?
By: Tupaki Desk | 17 Oct 2021 12:53 PM ISTవైసీపీ జిల్లాల వారీగా సమీక్ష చేసుకుంటోంది. గత సారి గెలుపుని కూడా పక్కన పెట్టి వచ్చే సారి పరిస్థితులు భిన్నంగా ఉన్న గెలవడానికి చూస్తోంది. ఇక ఉత్తరాంధ్రా జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లా విజయనగరం. ఇక్కడ ఉన్న తొమ్మిది అసెంబ్లీ, ఒక పార్లమెంట్ సీటు 2019 ఎన్నికల్లో వైసీపీ పరం అయ్యాయి. ఈసారి కూడా అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేయాలని వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది. గత ఎన్నికలలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ నాయకత్వం వహించారు. ఆయన కుటుంబ సభ్యులే నాలుగైదు టికెట్లు తీసుకుని ఎమ్మెల్యేలుగా అయ్యారు. అయితే ఈసారి మొత్తం సీన్ రివర్స్ చేయాలని వైసీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది. విజయనగరం జిల్లాలో ఈసారి విజయనగరం పూసపాటి రాజు అశోక్ జోరు పెంచుతారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన్ని ఢీ కొట్టేందుకు వైసీపీ కూడా రాజులనే ఆశ్రయిస్తోంది అంటున్నారు.
విజయనగరం జిల్లాలో బొబ్బిలి రాజులు కూడా పేరుమోసిన వారే. వారు కూడా బ్రిటిష్ వారి కాలంలోనే ముఖ్యమంత్రులుగా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో పనిచేశారు. ఇక 2004 నుంచి ఆ వంశీకుడు సుజయ క్రిష్ణ రంగారావు రాజకీయాలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ తరఫున రెండు సార్లు, వైసీపీ తరఫున ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ఆ తరువాత ఆయన 2019 ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు చేతిలో ఓడిపోయారు. ఆయన బేసిక్ గా యాంటీ టీడీపీ రాజకీయాలే చేస్తారు. ఎందుకంటే టీడీపీలో అశోక్ ఉన్నారు. ఆ రాజులకు బొబ్బిలి రాజులకు విభేదాలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో ఆయన అనివార్యమైన పరిస్థితుల్లోనే టీడీపీలోనికి వెళ్లారు. జగన్ బొత్సని చేరదీయడంతోనే ఆయన అలిగారు అని చెబుతారు. వచ్చే ఎన్నికల నాటికి బొత్స హవాను తగ్గించి జిల్లా నాయకత్వ బాధ్యతలు బొబ్బిలి రాజులకు అప్పగిస్తే వారు తిరిగి వైసీపీలోకి రావడానికి రెడీ అంటున్నారు. బొత్సను ఎటూ మంత్రి వర్గ విస్తరణలో పదవి నుంచి తప్పిస్తారు అన్న టాక్ ఉంది. అదే జరిగితే బొబ్బిలి రాజులు వైసీపీలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది అంటున్నారు. బొబ్బిలి రాజులు కనుక వస్తే జిల్లాలో మరోమారు క్లీన్ స్వీప్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. మొత్తానికి ఈసారి వైసీపీ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయితే సైకిల్ పార్టీకి మరో మారు చుక్కలు కనిపిస్తాయనే అంటున్నారు.