Begin typing your search above and press return to search.
వైఎస్సార్సీపీ మెనిఫెస్టో కమిటీ.. అంత డొల్లగానా!
By: Tupaki Desk | 24 Feb 2019 1:20 PM ISTఒక రాజకీయ పార్టీకి మెనిఫెస్టో అంటే ఆ పార్టీకి రాజ్యాంగంతో సమానం. ప్రస్తుత రాజకీయంలో మెనిఫెస్టోకి ఏ మాత్రం విలువను ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందీ. తెలుగుదేశం పార్టీ వాళ్లు అయితే అధికారంలోకి వచ్చాకా తమ పార్టీ అధికారిక వెబ్ సైట్ నుంచి తమ పార్టీ మెనిఫెస్టోని డిలీట్ చేశారు! గత ఎన్నికల ముందు టీడీపీ ఘనంగా ప్రకటించుకున్న మెనిఫెస్టోని తీరా ఎన్నికల తర్వాత అడ్రస్ లేకుండా చేశారు. మెనిఫెస్టో పార్టీ అధికారిక వెబ్ సైట్లో ఉంటే.. అందులోని అంశాల గురించి అంతా గుర్తు చేస్తారని భయపడి టీడీపీ పార్టీ మెనిఫెస్టోని తమ సైట్ నుంచి డిలీట్ చేసింది. ఇదీ పార్టీలు మెనిఫెస్టోకి ఇస్తున్న గౌరవం.
ఇక వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మళ్లీ మెనిఫెస్టోనీ రెడీ చేస్తోంది. ఐదేళ్ల పాటు అధికారం చేతిలో ఉంటే పాత మెనిఫెస్టోని డిలీట్ చేసిన పార్టీ.. ఇప్పుడు ప్రజలను కొత్తగా మోసం చేయడానికి మళ్లీ మెనిఫెస్టోని రెడీ చేస్తూ ఉండటం గమనార్హం.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మెనిఫెస్టో రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. రెండు రోజుల క్రితం మెనిఫెస్టో కమిటీని ప్రకటించింది జగన్ పార్టీ. ముప్పై ఒక్క మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. దీంట్లో కొద్ది మంది వరకూ ఫర్వాలేదు కానీ..చాలా మందికి అసలు మెనిఫెస్టో కమిటీ అంటే ఏం చేయాలో కూడా తెలియకపోవడం విశేషం.
ఈ జంబో కమిటీలో చాలా మంది నేతలకు ఇప్పుడు తామేం చేయాలో కూడా తెలియడం లేదు. ఏదో మెనిఫెస్టో కమిటీలో తమ పేర్లు వచ్చాయమని వారు చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో అధినేతకు ధన్యవాదాలు అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేసుకుంటున్నారు. అయితే వీళ్లకు సరైన అవగాహన లేకపోవడం విశేషం.
మెనిఫెస్టో కమిటీ మీటింగుకు కూడా వీళ్లు హాజరవుతారా.. అనేది ప్రశ్నార్థకమే.వీళ్లకు ఇలాంటి విషయాల మీద అవగాహన లేదు. వారిని ఆ కమిటీలో పెట్టారు. దానికి వారైనా ఏం చేస్తారు పాపం! అవగాహన లేని వాళ్లను కమిటీలో పెట్టిన వారిది తప్పు అవుతుంది. అవగాహన లేని వారిని అని ఏం ప్రయోజనం.
మెనిఫెస్టో కమిటీలో కనీసం యాభై శాతం మంది పరిస్థితి ఇదేనని.. అసలు మెనిఫెస్టో అంటే ఏమిటో మీనింగే వారికి తెలియడం లేదని సమాచారం. మరి ఇలాంటి కమిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మెనిఫెస్టోని తయారు చేస్తుందో, దాని ద్వారా ఎన్నికల ముందు ప్రజలకు ఎలా చేరవవుతుందో చూడాలి!
జగన్ ఏమో తమ పార్టీ మెనిఫెస్టో సూటిగా, స్పష్టంగా ఉంటుందని ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలలో డొల్లగా కనిపిస్తున్న కమిటీ.. ఆ లక్ష్యాన్ని ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి!