Begin typing your search above and press return to search.

జేసీపై జగన్ బ్యాచ్ మూకుమ్మడి మాటల దాడి

By:  Tupaki Desk   |   14 Jan 2017 11:21 AM IST
జేసీపై జగన్ బ్యాచ్ మూకుమ్మడి మాటల దాడి
X
జేసీ దివాకర్ రెడ్డిపై జగన్ బ్యాచ్ విరుచుకుపడింది. తమ అధినేతపై జేసీ చేసిన పరుష వ్యాఖ్యలపై వారు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మూకుమ్మడిగా మాటల దాడి చేయటమే కాదు.. జేసీపై ఇప్పటివరకూ అననన్ని మాటల్ని అనేయటం గమనార్హం. జేసీని ఓ బఫూన్ అని.. జోకర్ అని.. మతి భ్రమించిన చిల్లర నాయకుడిలా.. వీధి రౌడీలా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. జేసీ ఒళ్లు దగ్గర పెట్టుకొని మట్లాడాలని విరుచుకుపడ్డారు. వేలాది మంది పోలీసులు మధ్యా.. కార్యకర్తల మధ్య జగన్ పై పరుష వ్యాఖ్యలు చేయటం పెద్ద గొప్పేం కాదని.. దమ్ముంటే.. ఒంటరిగా కడపకు కానీ.. పులివెందులకు కానీ వచ్చి మాట్లాడగలరా? అని సవాల్ విసిరారు.

జేసీపై విరుచుకుపడిన జగన్ బ్యాచ్ లో..కడప జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ రెడ్డి.. కడప మేయర్ సురేష్ బాబు.. ఎమ్మెల్యే అంజద్ బాషాలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జేసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు చిత్తూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్.. జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి.. తాడిపత్రికి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తదితరులు.. జేసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బాబు మెప్పు కోసమే జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయన మాటలన్నీ బాబు ఇచ్చే పదవి కోసమే తప్పించి మరొకటి కాదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురంలో ఆయనకు డిపాజిట్ దక్కదని.. జేసీ రాజకీయ సన్యాసం తీసుకోవటమే తరువాయి అని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలు సీమ జిల్లాలకురావటంలో చంద్రబాబు చేసిందేమీ లేదని.. సీమలోనిఅన్నిప్రాజెక్టులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలోనే పూర్తి అయినట్లుగా చెప్పారు.

జేసీని ఒకవైపు తిడుతూనే.. చంద్రబాబును తప్పు పట్టిన జగన్ బ్యాచ్.. ఇటీవల ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఏపీ సర్కారు పాత్ర ఏమీ లేదన్నట్లుగా తేల్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జేసీపై వ్యక్తిగత విమర్శలు.. తీవ్ర ఆరోపణలు చేయటం గమనార్హం. జేసీకి మతి భ్రమించిందని.. అందుకే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నట్లున్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ కు మూలం జేసీ ఫ్యామిలీనేనని వ్యాఖ్యానించిన జగన్ బ్యాచ్.. పల్లెల్లో ఫ్యాక్షన్ చిచ్చు రేపుతున్నట్లుగా ఆరోపించారు. తాడిపత్రిలో బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డారని.. ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి హత్యలోనూ జేసీ సోదరులకు సంబంధం ఉందని వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/