Begin typing your search above and press return to search.

ఎవరూ సుఖంగా ఉండటం బాబుకు ఇష్టం లేదా?

By:  Tupaki Desk   |   28 Oct 2020 1:00 PM IST
ఎవరూ సుఖంగా ఉండటం బాబుకు ఇష్టం లేదా?
X
బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండేవారు.. ప్రజలకు ఇచ్చే సందేశాల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రయోజనం కోసం.. ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటానికి మించిన తప్పు ఇంకొకటి ఉండదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి.. వ్యవస్థల్ని ప్రశ్నించేలా.. శాంతిభద్రతల సమస్యల్ని పెంచేలా మాట్లాడటం దేనికి నిదర్శనం? తాను కోరుకున్న అధికారం చేతిలో ఉండకపోతే.. ప్రజల్ని రెచ్చగొట్టేయటం సరైనదేనా? అన్నది ప్రశ్న.

తమ ప్రభుత్వ హయాంలో పేదలకు కట్టిన ఇళ్లను సరైన సమయంలో పూర్తి చేయటంలో ఫెయిల్ అయిన బాబు సర్కారు.. ఈ రోజున వాటిని వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. సంక్రాంతి లోపు పేదలకు ఇళ్లను పంపిణీ చేయకుంటే.. వాటికి డిపాజిట్లు కట్టిన పేదలు వాటిని స్వాధీనం చేసుకుంటారని.. ఇళ్లల్లోకి చేరతారంటూచేసిన హెచ్చరిక సరైనది కాదని చెప్పకక తప్పదు.

పేదలు డిపాజిట్లు కట్టి.. ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని.. పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరటం.. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటంలో అర్తం ఉంది. అందుకు భిన్నంగా ఇళ్లను డిపాజిట్లు కట్టినోళ్లు స్వాధీనం చేసుకోమనే రెచ్చగొట్టే మాటలు ఏ మాత్రం సరికాదు. బాబు చేసిన ప్రకటనతో.. ఆరాచక శక్తులు రెచ్చిపోతే.. నష్టపోయేది ఎవరు? అదే జరిగితే.. అసలైన లబ్థిదారులకు తీవ్రమైన నష్టం వాటిల్లటం ఖాయం. అదే జరిగితే.. అప్పుడు అడ్డంగా బుక్ అయ్యేది చంద్రబాబే అన్నది మర్చిపోకూడదు.

ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉన్న పెద్దమనిషి.. ప్రభుత్వానికి సవాలు విసిరేలా ప్రజల్ని తన మాటలతో రెచ్చగొట్టటం ఎంతవరకు సమంజసం? పేదల కోసం కట్టిన ఇళ్లను.. వాటి లబ్థిదారులకు అందేందుకు రెచ్చగొట్టుడు మాటల్ని పక్కన పెట్టి.. వారికి ఆ ఇళ్లను కేటాయించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. బాబు మాటల్ని నమ్మి రెచ్చిపోయి.. జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? అన్నది అసలు ప్రశన. ఇంత సింఫుల్ అంశాల్ని బాబుకు ఎందుకు రానట్లు?