Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే డమ్మీ.. తండ్రి కమీషన్ రేట్స్ ఫిక్స్!

By:  Tupaki Desk   |   10 Nov 2020 12:15 PM IST
వైసీపీ ఎమ్మెల్యే డమ్మీ.. తండ్రి కమీషన్ రేట్స్ ఫిక్స్!
X
సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్న చందంగా మారిందట.. ఆ నియోజకవర్గంలో పరిస్థితి.. యువకుడు, ఉత్సాహవంతుడు అని వైసీపీ తరుఫున ఆ ఎమ్మెల్యేను గెలిపిస్తే ఆయన డమ్మీగా మారిపోయిన వైనంపై నియోజకవర్గ ప్రజలు, వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇప్పుడు కొడుకును పక్కనపెట్టి ఆ నియోజకవర్గంలో తండ్రి పెత్తనం చెలాయిస్తున్నాడట.. వైసీపీ కార్యకర్తలను కనీసం పట్టించుకోవడం లేదట.. ఈ తీరు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో వ్యతిరేకతకు కారణమవుతోంది.

పశ్చిమ గోదావరిలో ఒక ఎమ్మెల్యే స్థానంలో పెత్తనం అంతా ఎమ్మెల్యే తండ్రిదేనంట.. ఆ ఎమ్మెల్యే చదువుకున్నాడు.. మంచి పరిపాలన చేస్తాడని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీటు ఇచ్చాడట.. మార్పు కోసం వైఎస్ జగన్ ను చూసి అతన్ని గెలిపిస్తే ఎమ్మెల్యేను డమ్మీ చేసి మొత్తం పెత్తనం అంతా తండ్రి చేతుల్లోకి తీసుకున్నాడట..

వైసీపీ వాళ్లు వస్తే కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదట.. కాంట్రాక్టర్లు, కమిషన్ ఇచ్చే బ్యాచ్ వస్తే మాత్రం నేరుగా పర్సనల్ రూమ్ లోకి వెళ్లి మాట్లాడుతున్నారట.. అయితే ఇది అంతా వైసీపీ వాళ్లు రోజు చూసి తట్టుకోలేక పోతున్నారట.. కొన్ని వీడియోలు కూడా తీసి హైకమాండ్ కు కూడా పంపించారంట.. సమయం వచ్చినప్పుడు తీవ్ర స్పందన అవుతుందోమేనని వేచి చూస్తున్నారట..

కానీ అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే వైసీపీకి బాగా చెడ్డ పేరు వచ్చిందంట.. ఇంత కష్టపడి జగన్ ను చూసి గెలిపిస్తే.. మమ్మలను రోడ్డు మీద నిలబడాల్సి వచ్చిందని వైసీపీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట..

ఇప్పుడు ఎమ్మెల్యే వైసీపీకి ఏం అక్కరకు పోతున్నాడట.. ఆయన తండ్రి పెత్తనం భరించలేక నియోజకవర్గ కార్యకర్తలు వాపోతున్నారట.. ఇది ఎంత వరకు దారితీస్తుంది? వైసీపీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాలి.