Begin typing your search above and press return to search.
పీవీపీ కి హైకోర్టులో ఊరట!
By: Tupaki Desk | 1 July 2020 1:20 PM ISTవైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తనపై బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పీవీపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఉన్నత న్యాయ స్థానం మంజూరు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని విల్లా గొడవలో పీవీపీపై కేసు నమోదైంది.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో గోడవివాదంలో.. కైలాష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేశారు. ఏడాది క్రితం పివిపి విల్లాస్ లో ఇళ్లు కొనుగోలు చేశారు కైలాష్. అయితే ఆ సమయంలో ఎలాంటి రూల్స్ పెట్టకుండా విక్రయించారు అంటున్నారు ఆయన, కానీ ఇప్పుడు టెర్రస్‌పై గార్డెన్ నిర్మిస్తుంటే వద్దని పివిపి బెదిరిస్తున్నారని ఆరోపించారు.. దీనిపై తాను ఆగ్రహం వ్యక్తం చేయగా.. పివిపి తనపై దౌర్జన్యానికి దిగారని కైలాష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 మంది వ్యక్తులను తమ ఇంటిపై దాడి చేయడానికి పంపించాడని ఆరోపించారు. గతంలోనూ ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు కైలాష్.
రంగంలోకి దిగిన పోలీసులు పీవీపీ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో పీవీపీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి అరెస్ట్ చేయొద్దని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 27కు వాయిదా వేసింది. ఈ కేసు కొనసాగుతుండగానే పీవీపీ విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. బెంజ్ సర్కిల్ దగ్గర 108, 104 వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాసేపు సీఎం జగన్ తో ముచ్చటించారు.