Begin typing your search above and press return to search.
జగన్ బ్యాచ్ లో మరో వికెట్ పడనుందా?
By: Tupaki Desk | 18 April 2016 11:59 AM ISTఏ ముహుర్తంలో షురూ చేశారో కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాంచి హుషారు మీద ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఒకరి తర్వాత ఒకరన్నట్లుగా సాగుతున్న జంపింగ్ పర్వం భిన్నంగా సాగుతోంది. ఒక జిల్లా తర్వాత ఒక జిల్లా అన్నట్లుగా జంపింగ్ ల పర్వంగా సాగుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సైకిల్ ఎక్కేయటం పక్కా అని తేలిపోవటం.. వారిలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ బాబు బర్త్ డే రోజు పార్టీ మారనున్నట్లుగా డేట్ ఫిక్స్ చేసుకోవటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తర్వాత జంపింగ్ పర్వం అనంతపురం జిల్లా నుంచి ఉండనుందన్నది తాజా టాక్. అనంతపురం జిల్లాకు చెందిన కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా సైకిల్ ఎక్కటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఆయన పార్టీ మారతారన్న ప్రచారం బలంగా సాగుతోంది. ఈ వార్త బయటకు పొక్కగానే అలెర్ట్ అయిన జగన్.. తన మనుషుల్ని రంగంలోకి దించి.. చాంద్ భాషాతో మంతనాలు సాగించినట్లు చెబుతున్నారు. పార్టీ మారకుండా ఉండేలా చాంద్ భాషాను జగన్ మనుషులు ఒప్పించినట్లు చెబుతున్నా.. ఆయన ఆగటం కష్టమేనన్న మాట వినిపిస్తోంది.