Begin typing your search above and press return to search.
ఆ నాలుగు జిల్లాల్లో ఫ్యాన్ లీడ్ తగ్గేదేలే...!
By: Tupaki Desk | 22 Jan 2022 2:10 PM ISTఏపీలో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇంతకాలం వైసీపీ హవానే స్పష్టంగా నడుస్తున్నట్లు కనిపిస్తున్నా సరే..టీడీపీ కూడా అనూహ్యంగా పుంజుకోవడం మొదలైంది. గత ఎన్నికల్లో ఉన్న పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. వైసీపీ లీడ్ నిదానంగా తగ్గుతూ వస్తుంటే టీడీపీ లీడ్ పెరుగుతూ వస్తుంది. అయితే ఎక్కడ ఎలా ఉన్న ఓ నాలుగు జిల్లాల్లో మాత్రం వైసీపీ లీడ్ ఏ మాత్రం తగ్గడం కష్టమనే చెప్పొచ్చు. మిగతా జిల్లాల్లో కాస్త పరిస్తితులు అటు ఇటు తారుమారు అవ్వొచ్చు గానీ..నాలుగు జిల్లాల్లో మాత్రం వైసీపీ లీడ్‌ని తగ్గించడం జరిగే పని కాదా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఎన్నికల్లో ప్రతి జిల్లాలోనూ వైసీపీ హవానే నడిచింది. కానీ నిదానంగా ఇప్పుడు అధికార పార్టీ ప్రాభవం తగ్గుతూ వస్తుంది. ఎన్నికల నాటికి ఇంకా పరిస్తితి మారవచ్చు. అలాగే కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ-జనసేనలు గాని కలిస్తే వైసీపీని డామినేట్ చేస్తాయి. కానీ రాయలసీమలో మాత్రం వైసీపీ డామినేషన్ తగ్గించడం కష్టం. సీమలో అనంతపురం జిల్లాని పక్కనబెడితే....కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆధిక్యం తగ్గించడం కష్టంగానే ఉంది. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ లీడింగ్ కంటిన్యూ అవుతుంది. అనంతలో మాత్రం టీడీపీ పైచేయి సాధించేలా కనిపిస్తోంది.
కానీ ఆ నాలుగు జిల్లాల్లో మాత్రం వైసీపీని డామినేట్ చేయడం టీడీపీకి సాధ్యమయ్యేలా లేదు. ఒకవేళ గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రాకపోవచ్చు గానీ..వైసీపీ లీడ్ మాత్రం తగ్గడం కష్టం. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఉన్న 28 సీట్లలో వైసీపీ మళ్ళీ ఆధిక్యం సాధించవచ్చు. ఈ రెండు జిల్లాల్లో మూడొంతులకు పైగా నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులే లేరు. ఇక సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఒకటి రెండు నియోజకవర్గాలు వదిలేస్తే.. మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీని నిలబెట్టే నాయకులే లేరు.
చివరకు చంద్రబాబు ద్వితీయ శ్రేణి లీడర్లతో పాటు వైసీపీలో ఛాన్సులు లేక అవకాశాల కోసం ఎదురు చూస్తోన్న వారిని పార్టీలోకి తీసుకువచ్చి వారికి బాధ్యతలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక నెల్లూరు జిల్లాల్లో ఉన్న 10 సీట్లలో కూడా వైసీపీ హవా తగ్గించడం జరిగే పని కాదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ దిక్కూ దివాణం లేదు. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ పార్టీ జీరో అయ్యింది. ఇప్పటకీ పరిస్థితి మెరుగు పడలేదు. ఓవరాల్‌గా 48 సీట్లలో వైసీపీ 30 సీట్లు పైనే గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ నాలుగు జిల్లాల్లో ఫ్యాన్ లీడ్ తగ్గేదేలే అన్న పరిస్థితే ఉంది.