Begin typing your search above and press return to search.
నేరుగా ప్రజలతోనే తేల్చుకోనున్న వైసీపీ... ?
By: Tupaki Desk | 21 Jan 2022 3:09 PM ISTతాము అధికారంలోకి వచ్చాక ఏం చేసినా అది విపక్షాలు విమర్శించడమే కాకుండా దాన్ని ముందుకు సాగనీయకుండా చేస్తున్నారు అన్న భావన అయితే వైసీపీ సర్కార్ పెద్దలలో గూడు కట్టుకుపోయింది. ఇపుడు అదే రకమైన అభిప్రాయాన్ని ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలే ఉద్యోగుల వెనక ఉండి అంతా చేయిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
తాము అన్ని రకాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేశామని, వారు కోరకుండానే 62 ఏళ్ళకు పదవీ విరమణ వయసు పెంచామని వైసీపీ వర్గాలు అంటున్నారు. దీని వల్ల అప్పటికి లక్ష రూపాయలు నెలకు తీసుకునే ఉద్యోగులకు మరో రెండేళ్ళు అంటే 24 లక్షల రూపాయలు ఆర్ధికంగా కలసివస్తుందని, దాని మీద నాలుగు డీఏలు, రెండు ఇంక్రిమెంట్లు, రిటైర్ అయిన తరువాత ఈ పెరిగిన జీతంతో వచ్చే పెన్షన్ లోని ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా జగన్ సర్కార్ చేసిన అతి పెద్ద మేలు కాదా అని వైసీపీ నేతలు అంటున్నారు.
మరో వైపు జగనన్న స్మార్ట్ కాలనీలలో పది శాతం రిజర్వ్ చేసి ఇరవై శాతం రాయితీలతో ఇళ్ళు లేని ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలనుకోవడం కంటే పెద్ద ప్రయోజనం ఉంటుందా అని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ఇటీరియం రిలీఫ్ తో రెండేళ్ళుగా 27 శాతంగా పెంచిన మొత్తాలతో ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయల దాకా ఉద్యోగులకు ఇచ్చింది వాస్తవం కాదా అని కూడా పేర్కొంటున్నారు.
గత ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలొ న్యాయం చేయలేదని, తాము వారికి కూడా 23 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని చెబుతున్నారు. అలాగే ప్రత్యేక కార్పోరేషన్ ద్వారా వీరందరి జీతాలు ఇవ్వడం ద్వారా పైసా కూడా మధ్య దళారీలకు పోకుండా చూస్తున్నామని, ఇది వారికి బెనిఫిట్ కాదా అని కూడా అంటున్నారు. ఇక వారికి ఈపీఎస్ ఈ ఎసై వంటివి వర్తించేలా చూశామని చెబుతున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం గత ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తమ ప్రభుత్వం మూడు వేల కోట్ల దాకా ఖర్చు పెడుతోంది అని కూడా వివరిస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యూటీని 12 లక్షల నుంచి పదహారు లక్షలకు పెంచామని కూడా చెబుతున్నారు.
ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక అంగన్ వాడీలకు, శానిటరీ వర్కర్లకు, యానిమేటర్లకు, సంఘమిత్రలకు పెద్ద ఎత్తున జీతాలు పెంచిన సంగతికి గుర్తు చేస్తున్నారు. అలాగే హోం గార్డులకు కూడా జీతాలు పెంచిన ప్రభుత్వం తమదని చెబుతున్నారు. ఇక కేంద్ర పీయార్సీని దేశంలో యూపీ, గుజరాత్, రాజస్థాన్, ఒడిషా, మధ్యప్రదేశ్ లాంటివి అనుసరిస్తున్నాయని, ఏపీ కూడా అలా చేస్తే తప్పేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర బడ్జెట్ లో పెద్ద ఎత్తున ఉద్యోగుల జీతాలకే పోతోంది అని కూడా గణాంకాలను ముందు పెడుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ రకమైన లెక్కలతో వైసీపీ నేతలు ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాస్తవాలను ప్రజలకు వివరించాలని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చయని అంటున్నారు. మొత్తానికి ఇక జనంలోనే ఉద్యోగుల విషయం తేల్చుకోవాలని వైసీపీ ఆలోచనగా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఎవరి వాదన నెగ్గుతుందో.