Begin typing your search above and press return to search.

సబ్బం హరికి షాకిచ్చిన వైసీపీ సర్కార్

By:  Tupaki Desk   |   3 Oct 2020 11:45 AM IST
సబ్బం హరికి షాకిచ్చిన వైసీపీ సర్కార్
X
విశాఖలో మాజీ ఎంపీ, టీడీపీ నేతకు అధికారులు గట్టి షాకిచ్చారు. అక్రమ కట్టడాలని చెప్పి ఆయన ఇంటికి ఆనుకొని ఉన్న గదిని జీవీఎంసీ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అయితే ముందుగా సమాచారం ఇవ్వకుండా.. వేకువజాము సమీపంలో జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులపై మండిపడ్డారు. కూల్చివేతలపై సమాధానం ఇవ్వడానికి జీవీఎంసీ అధికారులు నిరాకరించారు.

ఇక తన గది కూల్చివేతపై సబ్బం హరి నిప్పులు చెరిగారు. అక్రమ కట్టడమా? అయితే పేపర్లు చూపిస్తే ఓ గంటలో తానే ఆ రూమ్ ను కూల్చివేస్తానని చెప్పినా.. అధికారుల నుంచి సమాధానం లేదన్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. ఏం జరుగుతుందో పక్కింటివారు నిద్రలేపేసరికే కూల్చివేస్తారా అని జీవీఎంసీ అధికారులను ప్రశ్నించారు.

విశాఖ జిల్లా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పెందుర్తిలో ఉన్న ప్రహరి గోడ ఆక్రమణ పేరుతో కూల్చివేతకు సిద్ధమయ్యారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది గురువారం గోడపై మార్కింగ్ చేయడం.. కక్షసాధింపులో భాగమేనని మండిపడ్డారు.

ప్రహరి కూల్చివేతకు రెవెన్యూ సిబ్బంది గురువారం రాత్రి ఎక్స్ కావేటర్ తో అక్కడికి వెళ్లారు. అయితే ఆ సమయంలో అధికారులు రాకపోవడంతో వెనుదిరిగారు.