Begin typing your search above and press return to search.

టికెట్లకు టిక్కు....వైసీపీ షాకులు స్టార్ట్ ...?

By:  Tupaki Desk   |   11 May 2022 5:30 PM GMT
టికెట్లకు టిక్కు....వైసీపీ షాకులు స్టార్ట్ ...?
X
టికెట్ అంటే రాజకీయ జీవులకు చాలా మోజు. ముందు అసెంబ్లీ గేటు దాకా వెళ్ళాలంటే పార్టీ టికెట్ చాలా ముఖ్యం. అందు కోసం ఏ పార్టీలో ఉన్న నేతలు అయినా టికెట్ల కోసం నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తారు. ఇక ఈ మధ్య జరిగిన పార్టీ సమావేశం లో పని తీరు బాలేని ఎమ్మెల్యేలకు, గ్రాఫ్ తగ్గిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కబోవు అన్నట్లుగా వైసీపీ హై కమాండ్ బలమైన సంకేతాలు ఇచ్చింది.

అయితే వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి పని తీరు మీద ఇంకా ఒక అంచనాకు రావాలీ అంటే గడప గడపకూ వైసీపీ కార్యక్రమంతో పాటు చాలా సర్వేలు కూడా చేసి నిర్ణయం తీసుకుంటారు. వారు ఎమ్మెల్యేలు కాబట్టి టికెట్లను నిరాకరించే విషయం చివరి నిముషం లో కానీ తేలదు, ఇక వైసీపీ తాను ఓడిన 24 సీట్లు ఉన్నాయి. ముందు అక్కడ పార్టీ పరిస్థితిని అంచనా వేసుకుంటోంది.

అదే విధంగా ఇంచార్జిలుగా నియమించిన వారు పని తీరు సరిగ్గా లేకపోతే మార్చేయడానికి వైసీపీ సిద్ధమైంది. ఆ విధంగా ఇరవై చోట్ల ఇంచార్జిలను మారుస్తోంది అంటున్నారు. ఇందులో భాగంగా వైసీపీకి గత రెండు ఎన్నికల నుంచి గట్టి ఝలక్ ఇస్తూ వస్తున్న విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఇంచార్జిని మార్చేశారు. ఇక్కడ 2014లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ పోటీ చేసి ఓడారు.

దాంతో మూడేళ్ళుగా ఆయన పనితీరుని గమనిస్తున్న వైసీపీ ఆయన్ని సడెన్ గా మార్చేసింది. ఆయన స్థానంలో ఇంచార్జిగా కార్పోరేషన్ కో డిప్యూటీ మేయర్ గా ఉన్న జియ్యాని శ్రీధర్ ని తెచ్చి నియమించేసింది. శ్రీధర్ బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత. అంతే కాదు, తన పరిధి లో కార్పోరేటర్ గా బాగా పనిచేస్తూ ఎపుడూ ఓటమెరగకుండా ఉన్నారు. ఆయనను ముందు పెట్టి 2024లో పశ్చిమ సీటుని గెలవాలని వైసీపీ చూస్తోంది. ఇక విశాఖ సౌత్ లో కూడా పెద్ద ఎత్తున సీటు కోసం గొడవ సాగుతోంది.

మరి ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని పార్టీ పెద్దగా నమ్మడం లేదు అంటున్నారు. దాంతో కీలక సమయంలో ఆయనకు ఝలక్ ఇచ్చి సరైన క్యాండిడేట్ కి ఇంచార్జి పదవి ఇస్తారు అంటున్నారు. విశాఖ జిల్లాలో మైనారిటీ నాయకునివా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్ అ రహామన్ కి ఈ సీటు కేటాయించవచ్చు అన్న చర్చ సాగుతోంది. అదే విధంగా విశాఖ తూర్పులో అక్రమాని విజయనిర్మల ఇంచార్జిగా ఉన్నారు.

ఆమె పనితీరు మీద కూడా పార్టీ సర్వే చేయిస్తోంది. బాలేదు అనుకుంటే ఎన్నికల సమయానికి ప్రస్తుత మేయర్ హరి వెంకట కుమారిని తెచ్చినా తెస్తారు అని అంటున్నారు. ఇక శ్రీకాకుళంలో కూడా అచ్చెన్నాయుడు సీటుకు దువ్వాడ శ్రీను అనుకుంటున్నా చివరి ఇక్కడ కిల్లి కృపారాణికి టికెట్ దక్కుతుందని చెబుతున్నారు. అలాగే గోదావరి జిల్లాలతో పాటు వైసీపీ ఓడిన చోట్ల ముందు మార్పు ఉంటుందని చెబుతున్నారు.