Begin typing your search above and press return to search.
గొట్టిపాటి, పోతుల..నెక్ట్స్ గరికపాటి క్వారీలు ఖతమే?
By: Tupaki Desk | 27 Aug 2020 10:15 AM ISTఆంధ్రప్రదేశ్ లో అక్రమ కార్యకలాపాలు చేస్తున్న మైనింగ్ క్వారీల మూసివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవలే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు గ్రానైట్ లీజులను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే..
తాజాగా బీజేపీ నేత, మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు వైసీపీ సర్కార్ షాక్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా బల్లికురవ వద్ద గరికపాటి రామ్మోహన్ కు చెందిన గ్రానైట్ క్వారీకి ముందుగా రూ.200కోట్ల జరిమానా విధించింది. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కానీ రెండోసారి నోటీసులు ఇచ్చి బుధవారం సాయంత్రం పర్మిట్లు నిలిపివేస్తూ విషయాన్ని గరికపాటి క్వారీ మేనేజర్ కు సూచించింది.
గరికపాటి టీడీపీని వీడి బీజేపీలో చేరడంతో క్వారీ జోలికి అధికారులు వెళ్లరని అంతా భావించారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం బీజేపీలో చేరినా గరికపాటికి షాక్ ఇవ్వడం సంచలనమైంది. టీడీపీ ఎమ్మెల్యేలే కాదు.. బీజేపీలో చేరినా వదిలిపెట్టమని వైసీపీ సర్కార్ ఈ దెబ్బతో నిరూపించినట్టైంది. దీనిపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో గరికపాటి కంపెనీ ఉంది.