Begin typing your search above and press return to search.

ఏపీలో జిల్లాలకు ఇంచార్జీ మంత్రులొచ్చేశారు

By:  Tupaki Desk   |   4 July 2019 7:41 PM IST
ఏపీలో జిల్లాలకు ఇంచార్జీ మంత్రులొచ్చేశారు
X
ఏపీలో జిల్లాలకు ఇంచార్జీ మంత్రుల నియామకం పూర్తి అయిపోయింది. మే 30న ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... కాస్తంత గ్యాప్ ఇచ్చి... 25 మంది మంత్రులతో తన కేబినెట్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. 25 మందికి ఆయా శాఖలను కూడా కేటాయించేసిన జగన్... ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేశారు. తాజాగా జిల్లాలకు ఇంచార్జీ మంత్రులను కేటాయిస్తూ జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలకు ఇంచార్జీ మంత్రులుగా నియామకాలపై జగన్ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని - ఆ జాబితా ఇదేనంటూ చాలా రోజుల క్రితమే ఓ జాబితా సర్కులేట్ అయ్యింది.

ఆ జాబితాకు అనుగుణంగానే ఇప్పుడు జగన్ సర్కారు జిల్లా ఇంచార్జీ మంత్రుల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితా ప్రకారం జగన్ కేబినెట్ లో మొత్తం మంత్రుల సంఖ్య 25గా ఉంటే... రాష్ట్రంలో 13 జిల్లాలు మాత్రమే ఉన్న నేపథ్యంలో జిల్లా ఇంచార్జీ మంత్రులుగా కేవలం 13 మందికి మాత్రమే అవకాశం దక్కింది. మిగిలిన 12 మందికి జిల్లా ఇంచార్జీ మంత్రులుగా అవకాశం దక్కలేదు. ఇక జిల్లా ఇంచార్జీ మంత్రులుగా నియమితులైన వారు, వారికి కేటాయించిన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పు గోదావరి - ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్
పశ్చిమగోదావరి- పిల్లి సుభాష్ చంద్రబోస్
గుంటూరు - పేర్ని నాని
ప్రకాశం- అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు - మేకతోటి సుచరిత
కర్నూలు - బొత్స సత్యనారాయణ
కడప- బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
అనంతపురం- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు - మేకపాటి గౌతమ్ రెడ్డి
శ్రీకాకుళం జిల్లా - వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం - చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
విశాఖపట్నం - మోపిదేవి వెంకటరమణ
కృష్ణా జిల్లా - కురసాల కన్నబాబు