Begin typing your search above and press return to search.
జగన్ మరో పథకానికి శ్రీకారం .. 1.50 కోట్ల కుటుంబాలకి YSR భీమా !
By: Tupaki Desk | 29 Aug 2020 1:21 PM ISTఅధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో అద్భుతమైన పథకాల్ని ప్రవేశపెడుతూ పేద ప్రజల సంక్షేమం కోసమే అహర్నిశలు కష్టపడుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేయనున్నారు.
ఈ పథకం కింద ఓ వ్యక్తి సహజంగా చనిపోతే అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే రూ.5 లక్షలు ఇవ్వనున్నారు . 18–50 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ పథకం వర్తించనుంది. 51–70 ఏళ్ల వయస్సు వారి కోసం మరో నిబంధన తీసుకొచ్చారు. ఆ వయసు వారికి శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలను అందించనున్నారు. రాష్ట్రంలోని పేదలకు భరోసా ఇచ్చేలా ఈ పథకాన్ని పూర్తిగా సొంత నిధులతో అమలు చేయాలని జగన్ ప్రభుత్వ మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.50కోట్ల బియ్యం కార్డులు ఉండగా.. ఆ కుటుంబాలన్నింటికీ ఈ పథకం వర్తించనుంది. దీనికోసం ఏడాదికి రూ.583.50 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.