Begin typing your search above and press return to search.

అన్నార్తుల కోసం ఆర్కే `రాజ‌న్న` క్యాంటీన్!

By:  Tupaki Desk   |   31 May 2018 12:16 PM GMT
అన్నార్తుల కోసం ఆర్కే `రాజ‌న్న` క్యాంటీన్!
X
ఆక‌లితో అల‌మ‌టిస్తోన్న నిరుపేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టానే ధృఢ సంక‌ల్పంతో వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి `రాజ‌న్న క్యాంటీన్లు` ప్రారంభించారు. అన్నార్తుల ఆక‌లి తీర్చేందుకు అతి త‌క్కువ ధ‌ర‌కే నాణ్య‌మైన‌ - రుచిక‌ర‌మైన భోజ‌నం అందిస్తున్నారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌ రెడ్డి పేరు మీద ప్రారంభించిన `రాజన్న` క్యాంటీన్ లో ప్రతి ఒక్కరికి రూ.4 రూపాయ‌ల‌కే పూర్తి భోజ‌నం అందించే బృహ‌త్కార్యానికి శ్రీ‌కారం చుట్టారు. నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు మండిపోతోన్న ఈ రోజుల్లో రూ.4 కే ప్లేట్ భోజనం అందించ‌డం నిజంగా గొప్ప విష‌య‌మే. నాలుగు రూపాయ‌ల భోజ‌న‌మే క‌దా...ఏం క్వాలిటీ ఉంటుందిలే అనుకోవ‌డానికి వీలు లేకుండా ఇంటి భోజ‌నం త‌ర‌హాలో అందిస్తున్నారు. ఈ రాజ‌న్న క్యాంటీన్ లో వారం పొడువునా అన్నం - కూర - పప్పు - చిప్స్ అందిస్తారు. నాలుగు రోజుల పాటు గుడ్డు ఇస్తారు .... మిగతా మూడు రోజులు గుడ్డు బ‌దులు...అరటి పండు ఇస్తారు.

మంగళగిరిలో గౌతమ బుద్ధుడి రోడ్డులో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆళ్ల‌ రామకృష్ణ రెడ్డి రాజన్న క్యాంటీన్ కు నేడు శ్రీ‌కారం చుట్టారు. ఈ క్యాంటీన్ లో ప్రతిరోజు మ‌ధ్యాహ్నం 12 గంటల నుంచి భోజ‌నం అందిస్తున్నారు. నెల మొత్తంలో 3 చోట్ల ఈ క్యాంటీన్ ను న‌డప‌డానికి సంక‌ల్పించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర మొదటి పది రోజులు - మిడి సెంటర్ వద్ద తర్వాతి పది రోజులు - ఉండవల్లి సెంటర్లో చివరి పది రోజులు ఈ క్యాంటీన్ అందుబాటులో ఉంటుంది. పేదవారు కూడా మూడు పూటలా క‌డుపు నిండా భోజ‌నం చేయాలనే సేవా దృక్ప‌థంతో ఈ క్యాంటీన్ ప్రారంభించామ‌నిర ఆర్కే అన్నారు.

నిరుపేద‌లంద‌రికీ ప్ర‌తిరోజు నాలుగు వేళ్ళు నోట్లోకి పోవాల‌న్న దివంగ‌త మ‌హానేత‌ రాజశేఖర్ రెడ్డి గారి కోరిక ప్ర‌కార‌మే తాను ఈ క్యాంటీన్ ప్రారంభించాన‌ని చెప్పారు. ఇప్పటికే చాలా ఎన్జీవోలు కేవలం ఒక్క రూపాయికే 4ఇడ్లీలు ఇస్తున్నార‌ని, ప్రభుత్వం చిత్త‌శుద్ధితో వ్వ‌వ‌హరిస్తే పేద‌ల‌కు చాలా చేయ‌చ్చ‌ని అన్నారు. అన్న క్యాంటీన్ ల‌ను టీడీపీ ప్రారంభించక‌పోతే `రాజన్న` క్యాంటీన్ టిఫిన్ సెక్షన్ కూడా మొదలు పెడతాన‌ని ఆర్కే అన్నారు. రాజ‌న్న క్యాంటీన్ కు ప్ర‌జ‌ల‌నుంచి విప‌రీత‌మైన ఆద‌రణ వ‌స్తోంది. మ‌హానేత వైఎస్ కోరిక ప్ర‌కారం నాలుగు రూపాయ‌ల‌కే నాణ్య‌మైన భోజ‌నం అందిస్తోన్నఆర్కేపై ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.