Begin typing your search above and press return to search.
నేడే వైఎస్సార్ బీమా ప్రారంభం .. బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం జమ !
By: Tupaki Desk | 21 Oct 2020 4:20 PM ISTఏపీలో గత ఏడాది రికార్డ్ స్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ... ఆ తర్వాత ఏపీలో ప్రజా సంక్షేమమే ద్యేయంగా , పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద వాడి కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు అమలు చేసిన ప్రభుత్వం తాజాగా .. పేదల కోసం మరో కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు ఉండి కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని నేడు ప్రారంభించనున్నారు.
ఏపీలో ఉన్న 1.41 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయబోతుంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం మొత్తం జమ చేస్తామని, వారం రోజుల్లో ఖాతాలకు చేరుతుందని చెప్పారు. ఈ పథకంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలని స్పష్టం చేశారు. నిరుపేద కుటుంబాలకు జీవన భద్రత కల్పిస్తూ కష్టకాలంలో ఆదుకునేలా వైఎస్‌ఆర్ బీమా పథకాన్ని తీసుకొచ్చింది.రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల్లో కుటుంబ పెద్ద హఠాత్తుగా మరణించడం లేదా అంగ వైకల్యానికి గురైతే ఆ కుటుంబం పడే అవస్థలను ప్రజా సంకల్ప పాదయాత్రలో సీఎం జగన్ స్వయంగా చూశారు. అధికారంలోకి రాగానే ఆ కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా నిలబడాలన్న లక్ష్యంతో వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రకటించారు.
ఈ పథకం ప్రయోజనాలు ఒకసారి చూస్తే :
బియ్యం కార్డులు కలిగిన వారు మాత్రమే ఈ బీమాకు అర్హులు. 18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది.18 – 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న లబ్ధిదారుడు సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు చొప్పున బీమా పరిహారం చెల్లిస్తారు.లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పూర్తి అంగవైకల్యం పొందితే రూ.5 లక్షలు బీమా పరిహారం అందిస్తారు.51 – 70 ఏళ్ల మధ్య వయసు లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.3 లక్షలు పరిహారం లభిస్తుంది.శాశ్వత అంగవైకల్యం పొందితే రూ.3 లక్షలు బీమా పరిహారం అందుతుంది. 18 – 70 సంవత్సరాల వయసు గల లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు పాక్షిక ,శాశ్వత అంగ వైకల్యానికి గురైతే రూ.1.50 లక్షల బీమా పరిహారం అందిస్తారు. నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పం తో వైఎస్సార్ బీమా పథకాన్ని అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.