Begin typing your search above and press return to search.

అవతరణ వేళ వైఎస్సార్ నామస్మరణం...ఆమె ప్రత్యేక ఆకర్షణ

By:  Tupaki Desk   |   1 Nov 2022 9:51 PM IST
అవతరణ వేళ  వైఎస్సార్ నామస్మరణం...ఆమె ప్రత్యేక ఆకర్షణ
X
ఆంద్ర రాష్ట్ర అవతరణ వేళ అమరజీవి పొట్టి శ్రీరాములుని తలవాలి. అయితే ఆయనకు నివాళి అర్పిస్తూనే గత ఏడాది నుంచి వైఎస్సార్ పేరిట అవార్డులను ప్రభుత్వం ప్రముఖులకు అందచేస్తోంది. ఈసారి కూడా ఆ కార్యక్రమం ఘనంగా సాగింది. అటు గవర్నర్ ఇటు ముఖ్యమంత్రి అవార్డులను అందచేశారు. వారితో పాటుగానే వేదిక మీద వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ ఆసీనులై మొత్తం కార్యక్రమాన్ని వీక్షించారు. చాలా కాలానికి బహిరంగ వేదిక మీద జగన్ తో పాటు విజయమ్మ కనిపించడం విశేషం అయితే ఈ మొత్తం కార్యక్రమానికి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అని చెప్పాలి. అలాగే అవార్డు గ్రహీతలు గవర్నర్, సీఎంలతో పాటు విజయమ్మకు కూడా అభివాదాలు చేయడం ఆకట్టుకుంది

నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికి ఏడున్నర దశాబ్దాల క్రితం మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయింది. అపుడు పదకొండు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం పేరిట 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. ఆ తరువాత ఉమ్మడి ఏపీలో ప్రకాశం జిల్లా 1970 దశకంలో కొత్తగా వచ్చి చేరింది. ఆ తరువాత విజయనగరం జిల్లా కూడా జత కలిసింది. ఇలా 13 జిల్లలా ఏపీ 2014లో తెలంగాణా నుంచి విడిపోయి నవ్యాంధ్రగా ఏర్పడిది. ఈ మధ్యనే 13 జిల్లాలను కాస్తా 26 జిల్లాలుగా జగన్ సర్కార్ చేసింది.

గత ఏడాది నుంచి ఆంధ్రా రాష్ట్ర అవతరణ ఉత్సవాలను కూడా ప్రభుత్వం అధికారికంగా నవంబర్ 1న నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులను కూడా 2021 నుంచి ప్రతీ ఏటా ఇవ్వడం ప్రారంభించారు. అలా ఈ ఏడాది కూడా విజయవాడ వేదికగా ఈ అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవార్డులను ప్రదానం చెశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నముఖ్యమంత్రి దివంగత నెత వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు.

ఆయన పేరిట అవార్డులు ప్రజలకు సేవలందించిన వారికి ఇవ్వడం ఒక స్పూర్తివంతమైన కార్యక్రమం అని అన్నారు. జగన్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో సమాజాభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేస్తున్న వారికి ఈ అవార్డులు అని పేర్కొన్నారు.

ఇక డాక్టర్ వైఎస్‌ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, డాక్టర్ వైఎస్‌ఆర్ కాంస్య బొమ్మ, జ్ఞాపిక, ప్రశంసా పత్రం, అలాగే డాక్టర్ వైఎస్‌ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు రూ. 5 లక్షల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తారు. మొత్తంగా చూసుకుంటే ఇరవై మంది 20 వ్యక్తులు సంస్థలకు వైఎస్సార్ జీవితకాల సాఫల్య పురస్కారాలను అందచేశారు. అలాగే మరో పది మంది ప్రముఖ వ్యక్తులు సంస్థలకు వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులను ముఖ్యమంత్రి, గవర్నర్ అందచేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.