Begin typing your search above and press return to search.

సామాన్యుడికి సరికొత్త భరోసా.. ఆసుపత్రి బిల్లు వెయ్యి దాటితే..

By:  Tupaki Desk   |   10 Nov 2020 1:00 PM IST
సామాన్యుడికి సరికొత్త భరోసా.. ఆసుపత్రి బిల్లు వెయ్యి దాటితే..
X
ఇవాల్టి రోజున సగటు జీవిని ఆసుపత్రి భయపెడుతోంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే.. పరిస్థితి ఏమిటన్నది అర్థం కావట్లేదు. గడిచిన కొన్నేళ్లుగా పరిస్థితుల్లో ఊహించలేని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆసుపత్రులు సామాన్యుడి బతుకుల్ని తీవ్రంగా ప్రభావితం చేయటమే కాదు.. కోలుకోలేనంత దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. అప్పుల్లోకి తీసుకెళ్లిపోతుున్నాయి. ఇలాంటివేళ.. ఆసుపత్రి బిల్లు సగటుజీవికి సమస్య కాకుండా ఉండేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ఆరోగ్య శ్రీ పథకం ఇప్పుడో శ్రీరామ రక్షగా మారింది.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడు జిల్లాల్లో ఇప్పటికే ఆసుపత్రి బిల్లు వెయ్యి దాటితే.. వైద్యం ఆరోగ్య శ్రీ కిందకు వచ్చేలా చేపట్టిన పథకం.. మిగిలిన ఆరుజిల్లాల్లోనూ ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. శ్రీకాకుళం.. తూర్పు గోదావరి.. క్రిష్ణ.. నెల్లూరు.. చిత్తూరు.. అనంతపురం జిల్లాల్లో ఆరోగ్య శ్రీ సేవల్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు 2200 వ్యాధుల్ని ఆరోగ్య శ్రీలో చేర్చారు.

వెయ్యి రూపాయిల బిల్లు దాటితే.. వారంతా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే ఈ కొత్త పథకంలో మరో 234 వ్యాధుల్ని చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. మొత్తం 2434 వ్యాధులు ఆరోగ్య శ్రీలో చేర్చినట్లవుతుంది. ఆసుపత్రికి వెళ్లినప్పుడు వైద్య సేవల బిల్లు వెయ్యి రూపాయిలు దాటితే.. ఆపై మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా తీసుకున్న ఈ పథకం సామాన్యులకు శ్రీరామ రక్షగా చెప్పక తప్పదు.