Begin typing your search above and press return to search.

విచారణ జరగాలి.. జగన్ సీఎం కావాలి

By:  Tupaki Desk   |   20 March 2019 5:56 AM GMT
విచారణ జరగాలి.. జగన్ సీఎం కావాలి
X
తని తండ్రి హత్యపై మీడియా, రాజకీయ పక్షాలు వివిధ రకాలుగా స్పందిస్తున్నాయని.. హత్యపై నిష్పక్షపాత విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత కోరారు. వైఎస్ వివేకా కూతురు సునీత తొలిసారి మీడియా ముందుకు వచ్చి దీనిపై స్పందించింది.. మరణించిన వారిని గౌరవించాలనే కనీసం సృహ లేకుండా రకారకాల ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ విచారణను ప్రభావితం చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్యపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై కలత చెందానని తెలిపారు. వివేకాకు పులివెందుల అన్నా..అక్కడి ప్రజలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. జగన్ ను సీఎం చేయడమే వివేకా లక్ష్యంగా పనిచేశారని.. తమ కుటుంబం అంతా ఒక్కటేనని.. చాలా పెద్ద కుంటుంబమని.. బేధాభిప్రాయాలు ఉన్నా అందరం కలిసి పోటీచేస్తామని చెప్పుకొచ్చారు.

తాను తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెతోనే ఉంటున్నానని.. తండ్రి వివేకా ఒంటరిగా పులివెందులలో ఉంటున్నారని సునీత వివరించారు. తన తండ్రిని అందరూ బాగానే చూసుకుంటారని.. అందరూ ప్రేమిస్తారని.. అలాంటి వ్యక్తిని అత్యంత క్రూరంగా చంపేసారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.

తన తండ్రి వివేకా మరణంపై సీబీఐతోనైనా.. మరే విచారణ అయినా నిష్పక్షపాతంగా విచారణ చేయాలని వైఎస్ సునీత స్పష్టం చేశారు. సిట్ కంటే పైన ఉండే కొందరు చేస్తున్న వ్యాఖ్యలు విచారణపై ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అధికారంలో ఉన్న వారు ఇలా చేస్తే ఖచ్చితంగా సిట్ విచారణపై ప్రభావం పడుతుందని ఆమె అన్నారు. మరణించిన వ్యక్తిపై ఇలాంటి ప్రచారం చేయడం కుమార్తెగా తాను జీర్నించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

తమది పెద్ద ఫ్యామిలీ అని.. 700 మంది వైఎస్ కుటుంబసభ్యులమని తామంతా ఏడాదికి ఒకసారి కలుస్తామని సునీత వివరించారు. ఇంత మంది ఉన్నచోట బేధాబిప్రాయలు సహజమన్నారు. వివేకా రాసినట్లున్న లేఖ ఆయనదా కాదా అన్నది ఫోరెన్సిక్ నివేదికలో తేలుతందన్నారు. వివేకా మృతితో అందరం షాక్ లో ఉన్నామని.. ఉద్దేశపూర్వకంగా చేశారా.? యాధృశ్చికమా తేల్చాల్సి ఉందని అన్నారు.