Begin typing your search above and press return to search.

వైఎస్ విజ‌య‌మ్మకు త‌ప్పిన పెను ప్ర‌మాదం.. అస‌లేం జ‌రిగిందంటే!

By:  Tupaki Desk   |   11 Aug 2022 11:03 AM GMT
వైఎస్ విజ‌య‌మ్మకు త‌ప్పిన పెను ప్ర‌మాదం.. అస‌లేం జ‌రిగిందంటే!
X
వైఎస్సార్ తెలంగాణ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ‌కు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఆమె ప్ర‌యాణిస్తున్న కారు టైరు పంక్చ‌ర్ అయ్యింది. అనంత‌పురం జిల్లాలో దివంగ‌త వైఎస్సార్ స్నేహితుడిని ప‌రామ‌ర్శించి వ‌స్తుండ‌గా ఆమె కారు టైర్ పంక్చ‌ర్ అయ్యింది.

అయితే ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి బ్రేక్ వేయ‌డంతో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు.

అనంతపురంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ స్నేహితుడు అయ్య‌పురెడ్డిని ప‌రామ‌ర్శించ‌డానికి విజ‌య‌మ్మ వెళ్లారు. అక్క‌డ నుంచి తిరిగొస్తుండ‌గా క‌ర్నూలు జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆమె ప్రయాణిస్తోన్న కారు టైరు పంక్చ‌ర్ అయ్యింది. అయితే కారు పెద్దగా వేగంలో లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. కారులో విజయమ్మతో పాటు ప్రయాణిస్తున్న మరెవరికీ ప్రమాదమూ జరగలేదు. వెంటనే విజయమ్మను మరో కారులో అక్కడి నుంచి పంపించారు.

విజ‌య‌మ్మకు ప్ర‌మాద‌మేమీ లేద‌ని తెలియ‌డంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా ఆమె హైద‌రాబాద్ లో ఉంటున్నారు. హైద‌రాబాద్ నుంచి అనంత‌పురానికి కారులో వ‌చ్చార‌ని వైఎస్సార్సీపీ శ్రేణులు చెబుతున్నాయి. అనంత‌పురంలో కార్య‌క్ర‌మం చూసుకున్నాక తిరిగి మ‌ళ్లీ హైద‌రాబాద్ వెళ్తున్న‌ప్పుడు ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని అంటున్నారు.

గ‌త జూలైలో జ‌రిగిన వైఎస్సార్సీపీ ప్లీన‌రీలో ఆమె వైఎస్సార్సీపీ గౌర‌వ అధ్య‌క్షురాలి ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక అప్ప‌టి నుంచి హైద‌రాబాద్ లోనే ఉంటున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన త‌న కుమార్తె వైఎస్ ష‌ర్మిల‌కు అండ‌గా ఉంటున్నారు.