Begin typing your search above and press return to search.

వైఎస్ఆర్ కు పులివెందులలా.. షర్మిలకు పాలేరా? అంత సీన్ లేదు అక్కా!

By:  Tupaki Desk   |   17 Dec 2022 4:30 AM GMT
వైఎస్ఆర్ కు పులివెందులలా.. షర్మిలకు పాలేరా? అంత సీన్ లేదు అక్కా!
X
పులివెందుల బిడ్డకు.. ఇప్పుడు పాలేరు అడ్డా అంటోంది. తండ్రి వైఎస్ఆర్ ను పులివెందుల ఎలా ఆదరించిందో తనను ఖమ్మం జిల్లాలోని పాలేరు అలానే ఆదరిస్తోందని కలలుగంటోంది. కానీ ఈ ఏపీ ఆడకూతురుకు తెలంగాణలో అంత సీన్ లేదని పలువురు విమర్శిస్తున్నారు. తెలంగాణను వ్యతిరేకించి జై సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న షర్మిల 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా ఈమెను తెలంగాణ జనాలు ఓన్ చేసుకోవడం లేదు.. గుర్తించడం లేదు. ఆంధ్రా సరిహద్దున ఉండే పాలేరులో ఆంధ్ర ప్రాంతీయ అభిమానంతో గెలవడానికి స్కెచ్ గీసినా ఆమె గెలుపు ఈజీ కాదని అంటున్నారు.

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఈరోజు పాలేరులో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయడంతో పాటు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత షర్మిల ‘పాలేరు’ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. చాలా ఆలోచన ప్రక్రియ తర్వాత, ఆమె పాలేరును తన నియోజకవర్గంగా ఎంచుకొని గెలిచేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇక్కడ అత్యధికంగా రెడ్డి సామాజికవర్గం ఉండడం.. ఆంధ్రా ప్రాబల్యం ఉండడం.. ఏపీకి సరిహద్దు కావడంతో తనకు గెలుపు పక్కా అని షర్మిల భావిస్తోంది. కానీ అదంతా ఈజీకాదని స్థానికులు చెబుతున్నారు.

ఈ కార్యక్రమంలో షర్మిల తల్లి వైఎస్‌ విజయమ్మ పాల్గొని మాట్లాడుతూ విజయమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల మాదిరిగానే షర్మిలకు పాలేరు ప్రత్యేక స్థానం. షర్మిల, ఖమ్మం మధ్య కూడా ప్రత్యేక బంధం ఉందని భావిస్తున్నాను. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత, ఆమె తన మొదటి బహిరంగ సభను ఇక్కడ నిర్వహించింది. ఆమె పాలేరు నుండి తన మొదటి పాదయాత్రను కూడా ప్రారంభించింది. బహుశా ఇది దేవుడే దిక్కు’’ అని విజయమ్మ అన్నారు.

పాలేరు నుంచి పోటీ చేసేందుకు షర్మిల చాలా సుముఖంగా ఉండటంతో 2023లో ఈ నియోజకవర్గం విచిత్రమైన, టఫ్ ఫైట్‌కు సాక్షిగా మారనుంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కందాల ఉపేందర్ రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు. తుమ్మల కంటే కేసీఆర్ కందాలకే ప్రాధాన్యత ఇవ్వవచ్చని వార్తలు వచ్చాయి.

మరోవైపు తుమ్మల బి-ఫారం పొందేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు టిక్కెట్ రాకపోవచ్చని వార్తలు వచ్చినా.. కొన్ని సమావేశాలతో తుమ్మల తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. ఒక సభలో కేసీఆర్‌తో అంటకాగాలని, మరో సభలో తన రాజకీయ ఎదుగుదలకు దివంగత ఎన్టీఆర్‌ కారణమన్నారు.

మొత్తమ్మీద, పాలేరులో షర్మిల గెలుపు చాలా కష్టంగా కనిపిస్తోంది. ప్రత్యర్థులు చాలా బలంగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఆది నుంచి కాంగ్రెస్ కు బలం ఉంది. ప్రజలు తమ ఎమ్మెల్యేగా ఎవరిని ఎన్నుకుంటారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.