Begin typing your search above and press return to search.

మమ్మల్నే ఇరికించాలని చూస్తున్నారు - సునీతారెడ్డి

By:  Tupaki Desk   |   22 March 2019 6:17 PM IST
మమ్మల్నే ఇరికించాలని చూస్తున్నారు - సునీతారెడ్డి
X
ఎన్నికలకు ముందు వైఎస్‌ వివేకానంద మర్డర్‌ రాజకీయంగా పెను సంచలన సృష్టించింది. ఇప్పటివరకు మర్డర్ చేసింది ఎవ్వరో తెలియకపోయినా.. అటు వైసీపీ - ఇటు టీడీపీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. జగన్‌ - చంద్రబాబు కూడా తమ ప్రసంగాల్లో వైఎస్‌ వివేక హత్యకు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో.. వైఎస్‌ వివేకానంద కుమార్తె సునీతారెడ్డి రంగంలోకి దిగారు. తమ తండ్రి హత్యకే టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ విమర్శించారు. అంతేకాదు.. విజయవాడ వచ్చి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ గోపాల కృష్ణ ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరాను కలిశారు.

తన తండ్రి హత్యకేసులో తమ కుటుంబ సభ్యులనే ఇరికించే ప్రయత్నం సాగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సునీతారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ నిష్పక్షపాతంగా లేదని ఆమె ఎన్నికల ప్రధాన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తన తండ్రి హత్య కేసును సీబీఐ లేదా ఎన్ ఐఎ లతో విచారణ జరిపించేలా కేంద్రానికి సూచించాలని కోరారు. సిట్ దర్యాప్తు తీరు అనుమానాస్పదంగా ఉందని అబిప్రాయపడ్డారు. అన్నింటికి మించి తన తండ్రి హత్య విషయంలో కేంద్రం హోంశాఖ అధికారుల్ని కూడా కలబోతున్నట్లు ఆమె చెప్పారు. నిష్పాక్షికంగా విచారణ చేయాల్సిన ప్రభుత్వమే తమపై నిందలు వేస్తుందని.. అలాంటపప్పుడు విచారణ సజావుగా సాగుతుందనే నమ్మకం లేకనే ఇలా ఎన్నికల కమిషనర్‌ కు ఫిర్యాదు చేశామని ఆమె చెప్పుకొచ్చారు.