Begin typing your search above and press return to search.

ఖమ్మంకు షర్మిల..21న పోరుబాట!!

By:  Tupaki Desk   |   11 Feb 2021 5:58 PM IST
ఖమ్మంకు షర్మిల..21న పోరుబాట!!
X
వైఎస్ఆర్ కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ నేతలతో సమావేశమైన షర్మిల తెలంగాణలోని అన్ని జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.తాజాగా ఖమ్మం జిల్లా నేతలతో వైఎస్ షర్మిల సమావేశం నేడు ముగిసింది. ఈనెల 21న ఖమ్మంలో వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.

టీఆర్ఎస్ సర్కార్ పై పోరుబాటు పట్టేందుకు షర్మిల రెడీ అయినట్టు తెలిసింది. పోడు భూముల అజెండాగా ఖమ్మంలో సమ్మేళం నిర్వహించనున్నారు. ఖమ్మంలో షర్మిలకు భారీ స్వాగతం పలికేందుకు ఇప్పటికే వైఎస్ఆర్ అభిమానులు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

వైఎస్ఆర్ అభిమానులతోపాటు గిరిజనులతో షర్మిల సమావేశం కానున్నారు. 21న ఉదయం లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్ తో ర్యాలీగా షర్మిల ఖమ్మం వెళ్లనున్నారు. అక్కడ తొలిసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటంతోపాటు వైఎస్ఆర్ అభిమానులను ఏకం చేయనున్నారు.