Begin typing your search above and press return to search.

షర్మిల పోటీచేసే నియోజకవర్గం అదేనా?

By:  Tupaki Desk   |   9 March 2021 6:30 AM GMT
షర్మిల పోటీచేసే నియోజకవర్గం అదేనా?
X
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇప్పుడు ఏపీలోని పులివెందులలో ఎలాగూ వైఎస్ఆర్ కుటుంబం గెలిచింది. ఆ ఆడబిడ్డ తెలంగాణ బిడ్డగా మారి ఈ రాజకీయాల్లో అడుగుపెడుతోంది. మరి ఇక్కడ గెలవాలి కదా.. అందుకే వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలా మారిన ‘పులివెందుల’ తరహాలో తెలంగాణలో తను పోటీచేసే నియోజకవర్గంపై వైఎస్ షర్మిల శూలశోధన మొదలు పెట్టిందట.. ఈ మేరకు రచ్చ గెలిచి తెలంగాణ రాజకీయాల్లో రాణించాలంటే ముందుగా తనకు అనువైన గెలిచే అసెంబ్లీ నియోకవర్గం అవసరం. అందుకే దీనిపై కసరత్తు మొదలుపెట్టిందని ఒక నియోజకవర్గాన్ని ఖాయం చేసుకుందని భోగట్టా..

వైఎస్ షర్మిల అతి త్వరలో తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె తెలంగాణలో గెలిచే నియోజకవర్గం ఏదీ.. సేఫ్ సైడ్ లో ఉండే ఆ ప్రాంతం వెతికే పనిలో బిజీగా ఉందట.. తెలంగాణలో రాజకీయంగా నిలబడాలంటే ముందుగా ఆమె గెలవాలి కాబట్టి ఆమె నిలబడే నియోజకవర్గం చూసుకుందని టాక్.

షర్మిల పోటీచేసే నియోజకవర్గం ఎంపిక కూడా పూర్తయ్యిందని ప్రచారం సాగుతోంది. అది ఖమ్మం జిల్లాలోని ఒక నియోజకవర్గం అని.. గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా చేసిన ఆర్. వెంకటరెడ్డి నియోజకవర్గం అని అంటున్నారు. ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారట.. వీరే కాదు.. రెడ్డిలు, ముస్లింలు, క్రిస్టియన్లు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఉన్నారట..

కాబట్టి తప్పనిసరిగా అదే నియోజకవర్గంలో ఆమె పోటీచేస్తుందని.. షర్మిల దగ్గరగా ఉండే జర్నలిస్టులు ఇదే ఖాయం చేశారని ప్రచారం సాగుతోంది. ఖమ్మం అయితే ఏపీకి సరిహద్దుగా ఉంటుందని.. వైఎస్ జగన్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తారని షర్మిల భావిస్తోందట.. అవసరం అయితే ఆంధ్రా నుంచి వచ్చి అక్కడి ఓట్లు ఛేంజ్ చేసుకొని షర్మిలను గెలిపిస్తారని కూడా అంటున్నారు.

చూడాలి మరీ షర్మిల ఇక్కడ నుంచి పోటీచేస్తారో లేదో కానీ ఇప్పుడా నియోజకవర్గంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణ అంతా ఉద్యమ, స్వరాష్ట్ర వేడి ఉంటుంది.. ఏపీకి ఆనుకొని ఉండే ఖమ్మంలో ఆ తీవ్రత తక్కువ. అందుకే షర్మిల ఆ జిల్లావైపు పోతోంది.కానీ తెలంగాణ తీవ్రత ఉన్న జిల్లాల్లోనే పోటీచేసి గెలిస్తే అది క్రెడిట్ అని.. ఖమ్మంను ఎంచుకోవడం రాంగ్ స్టెప్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.