Begin typing your search above and press return to search.

కేసీఆర్‌పై.. ష‌ర్మిల ఫైర్‌.. ద‌ళితుల భూములు లాక్కుంటున్నార‌ని కామెంట్లు

By:  Tupaki Desk   |   14 Aug 2021 11:00 PM IST
కేసీఆర్‌పై.. ష‌ర్మిల ఫైర్‌.. ద‌ళితుల భూములు లాక్కుంటున్నార‌ని కామెంట్లు
X
వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ) వ్య‌వ‌స్థాప‌కురాలు.. వైఎస్ ష‌ర్మిల‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై చేస్తున్న వ్యాఖ్య ల దూకుడును మ‌రింత పెంచారు. గ‌త కొన్నాళ్లుగా.. ఆమె కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. విద్యార్థుల ప‌క్షాన‌, నిరుద్యోగుల ప‌క్షాన‌.. ఇప్ప‌టికే దీక్ష‌లు కూడా చేశారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు మ‌రోసారి..ఆమె కేసీఆర్‌పై హాట్ కామెంట్లు కుమ్మ‌రించారు. అది కూడా హుజూరాబాద్ ఉప ఎన్నిక స‌మ‌యంలో ద‌ళితుల‌ను మ‌చ్చిక చేసుకుంటున్న కేసీఆర్‌ను అదే అంశంపై ష‌ర్మిల టార్గెట్ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ద‌ళితుల భూముల‌ను కేసీఆర్ లాగేసుకుంటున్నార‌ని.. వాటిలో పార్కులు, ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేస్తున్నార‌ని.. ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.

``ద‌ళితుల కు చెందిన భూముల‌ను లాగేసుకుంటున్న కేసీఆర్‌.. వారిని రోడ్డు పాలు చేస్తున్నారు. అసైన్డ్ భూములను హ‌స్త‌గ‌తం చేసుకుని వాటిలో పార్కులు నిర్మిస్తున్నారు. త‌న వారికి ప‌రిశ్ర‌మ‌ల కోసం కేటాయిస్తున్నారు. కొన్న త‌రాలుగా ద‌ళితులు అనుభ‌విస్తున్న భూముల‌ను లాగేసుకుంటున్న ఏకైక ముఖ్య‌మంత్రి కేసీఆరే`` అని ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. ద‌ళితులపై కేసీఆర్ మొస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని.. ఒక చేత్తో ద‌ళితుల‌ను నెత్తిన పెట్టుకుంటున్న భావ‌న క‌ల్పిస్తూ.. ద‌ళిత బంధు పేరుతో నాట‌కం ఆడుతున్నార‌ని.. మ‌రో చేత్తో ద‌ళితులు త‌ర‌త‌రాలుగా అనుభ‌విస్తున్న భూములను లాగేసుకుంటున్నార‌ని.. ఆరోపించారు.

ద‌ళితులు త‌న‌ను ఎద‌రించ‌లేర‌నే ధైర్యంతోనే కేసీఆర్ ఇలా వారి భూముల‌ను లాగేసుకుంటున్నార‌ని.. సంచ‌ల‌న కామెంట్లు చేశారు. అంతేకాదు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో కేసీఆర్‌.. ద‌ళితుల‌కు ఇచ్చిన హామీల‌ను కూడా నిల‌బెట్టుకోఅలేక పోయార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి మూడు ఎక‌రాల భూమిని ఇస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు వారి వ‌ద్ద భూముల‌నే లాగేసుకుంటున్నార‌ని.. ఇది అత్యంత దారుణ‌మ‌ని వ్యాఖ్యానించారు. తాత ముత్తాత‌ల కాలం నుంచి ద‌ళితులు ఆయా భూముల‌ను అనుభ‌విస్తున్న విష‌యం కేసీఆర్‌కు తెలియ‌దా? అని ప్ర‌శ్నించారు.

దీనికి ముందు.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఉపాధ్యుల‌ను ఉద్యోగాల నుంచి తొల‌గించ‌డంపై ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో గ‌డిచిన ఏడేళ్లుగా పాల‌న సాగిస్తున్న‌తెలంగాణ రాష్ట్ర స‌మితి.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ విద్య‌ను, వైద్యాన్ని దూరం చేసింద‌ని ష‌ర్మిల ఆరోపించారు. దాదాపు 7 వేల మంది ఉపాధ్యాయుల‌ను ఉద్యోగాల నుంచితొల‌గించార‌ని విమ‌ర్శించారు. కేసీఆర్‌కు పాల‌న చేత‌కాద‌ని.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఎలా న‌డిపించాలో కూడా ఆయ‌న‌కు తెలియ‌ద‌ని.. ఎద్దేవా చేశారు. ముఖ్య‌మంత్రి పీఠానికి కేసీఆర్ అవ‌మాన‌క‌రంగా.. మారార‌ని.. ఆ ప‌ద‌వి విలువ‌ను త‌గ్గిస్తున్నార‌ని.. ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు. మరి ష‌ర్మిల కామెంట్ల‌పై టీఆర్ ఎస్ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.