Begin typing your search above and press return to search.

మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలకు షర్మిల ఘాటు కౌంటర్

By:  Tupaki Desk   |   28 Oct 2021 1:47 PM GMT
మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలకు  షర్మిల ఘాటు కౌంటర్
X
ఏపీలో తిట్ట రాజకీయం కాస్త తెలంగాణకు పాకింది. పాదయాత్ర చేపట్టిన వైఎస్ షర్మిల అధికార టీఆర్ఎస్ పై చేస్తున్న విమర్శలకు నొచ్చుకున్న టీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి నోరుజారారు. దారుణంగా షర్మిలపై విరుచుకుపడ్డారు. 'మంగళవారం మరదలు' అంటూ షర్మిలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇప్పుడీ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

తెలంగాణలో రాజన్య రాజ్యం తేవడమే లక్ష్యంగా పార్టీ పెట్టానని చెప్పిన షర్మిల.. పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. పార్టీ పెట్టినప్పటి నుంచి నిరుద్యోగులు, తెలంగాణ సమస్యలపై పోరాడుతోంది. ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తోంది. పాదయాత్ర చేస్తున్నప్పటికీ మంగళవారం దీక్ష కొనసాగిస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే షర్మిలపై తాజాగా నాగర్ కర్నూల్ కు చెందిన టీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి దారుణ కామెంట్లు చేశారు. 'మంగళవారం మరదలు ఒకామె బయలుదేరింది' అంటూ నోరుపారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. షర్మిల డిమాండ్ వెనుక ఆంధ్రోళ్ల కుట్ర దాగి ఉందని.. 20శాతం నాన్ లోకల్ కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రవాళ్ల కోసం షర్మిల మాట్లాడుతున్నారని నిరంజన్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమయ్యాయి.

తనపై దారుణ వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డికి వైసీపీ అధ్యక్షురాలు కౌంటర్ ఇచ్చారు. 'చందమామను చూసి కుక్కలు మొరగడం సహజం..కుక్కలకు కుక్కబుద్ది ఎక్కడ పోద్ది. సంస్కారం లేని కుక్కలు టీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా ఉన్నారు. ఈ మంత్రికి లేదా? భార్యాబిడ్డలు, తల్లి చెల్లి.. ఈ కుక్కకు కవిత గారు ఏమవుతారో మీరు అడగండి.. మేం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తే హేళన చేస్తారా? ఈ కుక్కలను తరిమికొట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి' అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.