Begin typing your search above and press return to search.

అరుదైన పిక్: నాన్నతో వైఎస్ జగన్ చిన్నప్పటి ఫొటో

By:  Tupaki Desk   |   8 July 2020 12:18 PM GMT
అరుదైన పిక్: నాన్నతో వైఎస్ జగన్ చిన్నప్పటి ఫొటో
X
నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. దీంతో ఆయనను అందరూ గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ఆర్ తో అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైయస్ఆర్ కుటుంబంలోని ఆల్బమ్ నుంచి వచ్చిన అరుదైన చిత్రాలలో ఇది ఒకటి. ఇది చాలా అరుదైన ఫొటో. ఎందుకంటే ఇది ఈరోజు వరకు బయటకు రాలేదు. ఎక్కడా ప్రసారం కాలేదు.

ఈ అరుదైన ఫొటో 1970 - 80ల మధ్యకాలంలోనిది వైఎస్ఆర్ ఫ్యామిలీ చెబుతోంది. వైయస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో వైఎస్ఆర్ తోపాటు జగన్ కూడా కన్పిస్తున్నారు.

వైయస్ఆర్ అభిమానులు ఆయన సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో "వైయస్ఆర్ జయంతి"ని ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రదేశాలలో ఉన్న వైయస్ఆర్ విగ్రహాల వద్ద ఆయనకు ఘననివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ అరుదైన ఫొటోలో తండ్రీకొడుకులు వైఎస్ఆర్, వైఎస్ జగన్ లు కనిపించడం విశేషం. వైఎస్ జగన్ ఈ ఫొటోలో 10 ఏళ్లలోపే వయసును కలిగి ఉన్నాడు.