Begin typing your search above and press return to search.

వైఎస్ వెంట నిలిచిన వాళ్లు, జగన్ వెంట నిలబడుతున్నారా?

By:  Tupaki Desk   |   7 Sep 2017 9:39 AM GMT
వైఎస్ వెంట నిలిచిన వాళ్లు, జగన్ వెంట నిలబడుతున్నారా?
X
నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే కథ ఎలా ఉండేదో కానీ.. నంద్యాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తీరును చూసి మాత్రం - బాబు తీరును వ్యతిరేకించే వాళ్లలో ఒకరకంగా అసహనం మొదలైందని సమాచారం. డబ్బు - కుల సమీకరణాలు - అధికారం వంటి వాటిని ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీ గెలిచినందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో.. బాబు పాలన తీరును వ్యతిరేకించే వాళ్లు - ఈ అనైతిక విజయం పట్ల మరింతగా మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో బాబుకు సరైన బుద్ధిచెప్పాలనే లక్ష్యంతో.. రాజకీయంగా సైడైపోయిన వాళ్లు కూడా తమ సర్వశక్తులనూ ఒడ్డటానికి ముందుకు వస్తున్నట్టుగా సమాచారం.

ప్రత్యేకించి..గతంలో వైఎస్ వెంట నిలిచిన వాళ్లలో చాలా మంది నంద్యాల బై పోల్ తర్వాత జగన్ కు మరింత దగ్గరైనట్టు సమాచారం. ఇప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్లు బయట నుంచి చంద్రబాబుతో పోరాడుతున్నారు. అంశాల వారీగా బాబును కడిగేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల ప్రతిపక్షానికి ఉపయోగం ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో.. ఉండవల్లి జగన్ తో చేతులు కలపడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యక్ష పోటీకి కాకపోయినా.. ఆర్థిక శక్తి ఉన్న వ్యక్తి కాకపోయినా.. ఉండవల్లి మేధస్సు వైకాపాకు ఉపయోగపడుతుంది. అందుకు సమయం దగ్గర పడుతోందని.. త్వరలోనే ఆయన వైకాపాలోచేరడం ఖాయమని సమాచారం.

ఇక కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో ఎంపీలుగా వ్యవహరించిన వాళ్లకు కూడా ఆ పార్టీతో భవితవ్యం లేదని స్పష్టమైంది. అటు రాజకీయ ప్రత్యామ్నాయంగానూ, ఇటు యాంటీ చంద్రబాబు ఫీలింగ్ తోనూ.. వీళ్లంతా వైకాపా వైపు నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాయి ప్రతాప్ - కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి - కావూరి - పురందేశ్వరి - మాగుంట - టీ సుబ్బరామిరెడ్డి - కిల్లి కఈపారాణి తదితరులంతా వైకాపా వైపు చేరే అవకాశాలున్నాయని సమాచారం. చంద్రబాబు గేమ్స్ తో బీజేపీలోకి చేరి కూడా కొంతమందికి ప్రశాంతత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వారు తప్పసరిగా వైకాపాలో చేరాల్సిన పరిస్థితులు అగుపిస్తున్నాయి.

వీళ్లలో కొంతమందిని ఎంపీలుగా పోటీ చేయించాలనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగా యువతరం నేతలకు అవకాశం ఇచ్చి సీనియర్లను ఎంపీలుగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. రాజకీయంగా ఈ ఎత్తుగడ ఆసక్తిదాయకంగా అగుపిస్తోంది.