Begin typing your search above and press return to search.
జగన్ పక్కా ప్లాన్.. ప్రధానికి సమాచారం.. సుప్రీం ఏం నిర్ణయిస్తుంది?
By: Tupaki Desk | 12 Oct 2020 5:00 PM ISTసీఎం జగన్ ఈనెల 6న ప్రధాని మోడీతో ఢిల్లీ సమావేశమయ్యాక ఏపీ రాజకీయాల్లో ఒక భారీ కుదుపు వచ్చింది. ఈ భేటి తర్వాత జగన్ ఒక సీరియస్ విషయాన్ని లేవనెత్తి షేక్ చేశారు. ఈ భేటికి సంబంధించిన విషయాలను అటు ప్రధాని కార్యాలయం, ఇటు సీఎం కార్యాలయం బయటపెట్టలేదు. అభివృద్ధి, నిధులకు సంబంధించిన విషయాలే మోడీ, జగన్ మధ్య చర్చకు వచ్చాయని అందరూ చెప్పుకొచ్చారు.
మోడీతో భేటి తర్వాత సీఎం జగన్ ఓ సుప్రీం కోర్టు జడ్జిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. దీన్ని ప్రభుత్వ సలహాదారు బయటపెట్టి సంచలనం సృష్టించారు.
ప్రధాని నరేంద్రమోడీ నుంచి అభయం తీసుకునే జగన్ ఈ భారీ స్టెప్ వేశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. జగన్ కు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ భారీ తతంగాన్ని నడిపిస్తున్నారని అర్థమవుతోందంటున్నారు.
జగన్ లేఖ రాయడం వ్యూహాత్మక పోరుగానే భావిస్తున్నారు. కాబోయే చీఫ్ జస్టిస్ పై సీఎం జగన్ రాసిన లేఖ విషయాన్ని మోడీకి ముందుగా చెప్పి ఆయన అనుమతితోనే రాశారని ప్రచారం సాగుతోంది. ఈ లేఖలోని అంశాలను ఏపీ ప్రభుత్వం బహిర్గతం చేయడాన్ని బట్టి చూస్తే ప్రజల్లోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి ఆరోపణలు దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత చీఫ్ జస్టిస్ చర్యలు తీసుకుంటారా లేక మౌనంగా ఉండిపోతారా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. గతంలో సుప్రీం కోర్టు జడ్జిలుగా ఉన్న వారిపై మాజీ జడ్జిలపై ఆరోపణలు వస్తే సుప్రీం కోర్టు విచారణ జరిపి తీర్పులు ఇచ్చింది.
ఇటీవల సుప్రీం చీఫ్ జస్టిస్ బాబ్డేపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ వేసిన కేసును కూడా సుప్రీం ధర్మాసనం విచారించి రూపాయి ఫైన్ గా విధించింది. ఇప్పుడు జగన్ ఆరోపించిన జడ్జి వ్యవహారంలో సుప్రీం ఏం చర్య తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.