Begin typing your search above and press return to search.
మంచితనం... సంచి నింపుతుందా...?
By: Tupaki Desk | 6 Jan 2022 9:00 PM ISTమీ కుటుంబ సభ్యుడిని. మీలో ఒకడిని. మీరంటే నాకు అభిమానం ఉంది. మీకు మంచి చేయాలన్న తపన నాలో చాలా ఉంది. ఇదీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలతో జగన్ సమావేశం అయిన సందర్భంగా వారితో ఆయన ప్రవర్తించిన తీరుకు ఉద్యోగ సంఘాల నేతలు ఫిదా అయ్యారని టాక్. తన కంటే వయసులో పెద్ద వారిని అన్నా అని సంభోదించడమే కాకుండా వారు చెప్పిన సమస్యల మీద తానే స్వయంగా నోట్ రాసుకున్న జగన్ కొత్త ఆశలే కల్పించారు.
మీకు పూర్తి న్యాయం చేయాలని మనసు అయితే ఉంది, ఆ మంచితనమూ ఉంది. కానీ మీరు వాస్తవిక దృక్పధంతో ఆలోచన చేయాలని ఉద్యోగ నేతలతో జగన్ అన్నారని సమాచారం. ప్రభుత్వం మోయలేని విధంగా భారాలు ఉండకూడదని జగన్ ఈ సందర్భంగా అనడం విశేషం. ప్రభుత్వానికి మంచి చేయాలనే ఉంది. అయితే ఏదీ భారం కాకూడదు అని జగన్ పేర్కొన్నారు.
మంచి చేయాలన్న తపన నాలో ఉంది అని జగన్ చెప్పుకున్నారు. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తాను అని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలకు ఆయన హామీ ఇచ్చారు. మొత్తానికి ఎంతో కాలంగా జగన్ తో భేటీకి ఉద్యోగ సంఘాల నేతలు ఎదురుచూస్తూంటే వారికి ఆయనతో మాట్లాడే ఆ అవకాశం ఎట్టకేలకు లభించింది.
అయితే జగన్ ఈ సందర్భంగా అన్న మాటలను ఉద్యోగ సంఘాల నేతలు పదే పదే మననం చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి భారం కాకూడదని, మీరూ సానుకూల దృక్పధంతో ఉండాలని కోరుతున్నామని ముఖ్యమంత్రి అనడంతోనే కొత్త సందేహాలు కలుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఫిట్ మెంట్ తో పాటు దాదాపుగా డెబ్బై ఒక్క అంశాల మీద చర్చ సాగింది. వాటిని అన్నింటినీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మోయలేని భారం అంటోంది. మీ మీద సానుభూతి ఉంది అంటూనే మీరే సహకరించాలని అంటోంది.
ఇక సీఎస్ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కేవలం 14.29 శాతం ఫిట్ మెంట్ నే సిఫార్స్ చేసింది. మరో వైపు ఉద్యోగులేమో 55 శాతం ఫిట్ మెంట్ కోరుతున్నాయి. చూస్తే తేడా భారీగా ఉంది. మరి ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడాలి. అదే టైమ్ లో ప్రభుత్వం ముప్పయి శాతానికి తక్కువ లేకుండా ఫిటి మెంట్ ఇస్తుందని ప్రచారం అయితే ఉంది. దానికి అటూ ఇటూ అయినా ఉద్యోగులు అంగీకరిస్తారా అన్నదే ఇక్కడ చర్చ.
మరో వైపు గత ప్రభుత్వంలో చంద్రబాబు భారీగా అంటే 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని చెబుతున్నారు. ఇపుడు దాని కంటే ఎక్కువ ఇవ్వాలన్నదే ఉద్యోగుల కోరిక, డిమాండ్. అయితే నాడు అంత పెద్ద ఎత్తున ఫిట్ మెంట్ ఇవ్వడం వల్ల భారంగా ఉందని, ఈసారి తగ్గించాలని ప్రభుత్వ వర్గాల ఆలోచనగా ఉందని టాక్.
ఏది ఏమైనా జగన్ బాగా మాట్లాడారని, సానుకూలవాతావరణంలో చర్చ సాగిందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. రెండు మూడు రోజుల్లో పీయార్సీ మీద ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుంది అంటున్నారు. అదే టైమ్ లో ఎంత ఇస్తారు, ఎలా ఇస్తారు అన్నదే అందరిలోనూ ఆలోచనగా ఉంది. చూడాలి మరి జగన్ మంచితనం ఎంత, ఉద్యోగుల సంచి నింపేటంతగా ఉంటుందా లేదా అన్నదే ఇపుడు కీలకమైన పాయింట్. ఇది తేలాలంటే మరో రెండు రోజుల పాటు వెయిట్ అండ్ సీ.