Begin typing your search above and press return to search.

గిరిజనులకు 1.3లక్షల ఎకరాల భూమి పంపిణీ..జగన్​ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   2 Oct 2020 6:30 PM IST
గిరిజనులకు 1.3లక్షల ఎకరాల భూమి పంపిణీ..జగన్​ సంచలన నిర్ణయం
X
గిరిజనుల సంక్షేమం కోసం సీఎం జగన్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా 1,30,679 ఎకరాలకు సంబంధించిన 55,513 ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్​ మాట్లాడుతూ.. గాంధీ జయంతి రోజున గిరిజనులకు న్యాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేందుకు వారికి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలను పంపిణీ చేసినట్టు చెప్పారు. ఇప్పటివరకు లక్షా 53వేల మంది గిరిజనులకు 3.12లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసినట్టు చెప్పారు.ఇక గిరిజనులకు కేటాయించిన భూమికి వారికి రైతు భరోసా సాయం కూడా అందించనున్నట్టు చెప్పారు.

‘పాదయాత్రలో నేను ఎందరో గిరిజనులను కలుసుకున్నాను. వారితో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నాను. అప్పుడు వారికిచ్చిన హామీ మేరకు ప్రస్తుతం భూపంపిణీ చేస్తున్నాను. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతిహామీని నెరవేర్చుతానని మళ్లీ చెబుతున్నాను. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా డిజిటల్​ సర్వే ద్వారా పట్టాలు పంపిణీ చేశాం. గిరిజనులకు పంటలు వేసుకొనేందుకు కూడా ఆర్థికసాయం చేస్తాం. వారికి ఆయా జిల్లాల కలెక్టర్లు అన్నివిధాలా దిశానిర్దేశం చేస్తారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాలకు, కురుపాంలో రూ.153 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టాం. సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, బుట్టాయిగూడెం, రంపచోడవరంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాం. త్వరలోనే వాటిని ప్రారంభిస్తాం. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ పథకం కింద గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాం.’ అని సీఎం జగన్​ చెప్పారు.