Begin typing your search above and press return to search.
స్పీకర్ కే ఓపెన్ ఆఫర్ ఇచ్చిన జగన్..?
By: Tupaki Desk | 3 Sept 2015 11:39 AM ISTసహజసిద్దంగా వ్యాపారవేత్త కావటంతో కావొచ్చు.. ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాజాగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య ఆసక్తిని రేకెత్తిస్తోంది. గురువారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే.. ప్రభుత్వ విధానాల మీద విపక్షాలు విరుచుకుపడ్డాయి. దీంతో.. సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా విపక్ష నేత జగన్ మాట్లాడుతూ.. స్పీకర్ కోడెల శివప్రసాద్ కు వినూత్న ఆఫర్ ఇచ్చారు.
రాష్ట్రంలో కరవు నెలకొందని.. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయి.. సామాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న నేపథ్యంలో.. శుక్రవారం నాటి సభలో ఈ అంశాలకు చర్చకు అవకాశం ఇస్తామని మాట ఇస్తే.. గురువారం ప్రశ్నోత్తరాలకు తాము అడ్డు తగలమని పేర్కొన్నారు.
సహజంగా విపక్షాలు ఆందోళన చేయటం.. దానికి స్పీకర్ సర్దిపుచ్చటం.. మరీ కాదనుకుంటే సభను వాయిదా వేసి.. బీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజీ చేయటం లాంటివి మామూలే. కానీ.. జగన్ మాత్రం అందుకు భిన్నంగా.. రేపు మాట్లాడే అవకాశం ఇస్తే.. ఈ రోజు గొడవ చేయమంటూ ఆఫర్ ఇవ్వటంపై పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఓపెన్ ఆఫర్ లు ఇవ్వటం జగన్ తర్వాతే ఎవరికైనా సాధ్యమేమో.