Begin typing your search above and press return to search.

అసెంబ్లీ సాక్షి గా సుజనా చౌదరి పరువు తీసిన జగన్

By:  Tupaki Desk   |   21 Jan 2020 11:26 AM IST
అసెంబ్లీ సాక్షి గా సుజనా చౌదరి పరువు తీసిన జగన్
X
ఏపీ కి 3 రాజధానులు అవసరం అంటూ సీఎం జగన్ ప్రతిపాదన చేసినప్పుడు అందరికంటే ముందు బట్టలు చింపుకుంది బీజేపీ ఎంపీ సుజనా చౌదరి యే.. టీడీపీ నుంచి వెళ్లి బీజేపీలో చేరిన ఈ పెద్ద మనిషి ఏకంగా సీఎం జగన్ నే బెదిరించాడు. అమరావతి రైతులకు మద్దతుగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అప్పట్లో సంచలన కామెంట్స్ కూడా చేశారు. ‘అమరావతిని మార్చడం సులభం కాదు.. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారదని.. వైసీపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు మారిస్తే కేంద్రంలోని బీజేపీ మౌనంగా ఉండదంటూ ’ జగన్ సర్కారునే అప్పట్లో సుజనా చౌదరి బెదిరించారు. కేంద్రం బూచీ చూపి జగన్ ను దారికి తెచ్చే కుట్రలు కుంతంత్రాలను చేశారనే విమర్శలున్నాయి.

ఈ నేపథ్యం లో అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ని, బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని కడిగిపారేశారు సీఎం జగన్. 3 రాజధానులపై చర్చ సందర్భంగా ఏపీలో వ్యతిరేకిస్తున్న బీజేపీ వైఖరిని పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చి మరీ తూర్పార పట్టారు.

సీఎం జగన్ ఏపీ అసెంబ్లీ లో బీజేపీ మేనిఫెస్టోను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అందరికీ చూపించారు. అందులో ఏపీ బీజేపీ శాఖ అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు, అమరావతి రైతుల నుంచి చంద్రబాబు లాగేసిన భూములను వెనక్కి ఇస్తామన్న బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరును అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. తాను అధికారంలోకి వచ్చాక బీజేపీ చేస్తానన్నదే చేశానని.. ఇప్పుడు ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో బీజేపీ ఇరుకున పడ్డట్టు అయ్యింది.

ఇక బీజేపీ సభ్యుడు సుజన చౌదరి పై నిప్పులు చెరిగారు జగన్. అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్న సుజనా చౌదరికి ఏం తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని.. ఇలాంటి వ్యక్తులను తన్ని బీజేపీ నుంచి తన్ని బయటకు పంపాలని జగన్ బీజేపీ అధిష్టాన్ని కోరడం సంచలనంగా మారింది.సుజనా చౌదరి తన్ని తరిమేయండన్న జగన్ మాటలు వైరల్ గా మారాయి.