Begin typing your search above and press return to search.
రెండు మూడు రోజుల్లో పీఆర్సీ.. ఉద్యోగులకు జగన్ తీపికబురు
By: Tupaki Desk | 6 Jan 2022 7:46 PM ISTఏపీ సీఎం జగన్ ఉద్యోగులకు తీపికబురును అందించాడు. రెండు మూడురోజుల్లోనే పీఆర్సీని ప్రకటించనున్నట్లు తెలిపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని 133 ఉద్యోగ సంఘాలతో భేటి అనంతరం జగన్ మాట్లాడారు. ఉద్యోగ సంఘాల సమస్యలన్నీ నోట్ చేసుకున్నానని.. వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని వెల్లడించారు.
ఉద్యోగ సంఘాలన్నీ సానుకూల దృక్పథంతో ఉండాలని జగన్ సూచించారు. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని.. మంచి చేయాలనే తపనతోనే ఉన్నట్టు జగన్ పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తానని సీఎం జగన్ తెలిపారు.
ఉద్యోగ సంఘాలు ప్రాక్టీకల్ గా ఆలోచించాలని జగన్ కోరారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, సచివాలయ ఉద్యోగులు సర్వీసుల పర్మినెంట్ డిమాండ్లన్నీ క్రమపద్ధతిలో నెరవేరుస్తామని జగన్ తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్ని తెలిసినవారిగా ఉద్యోగులంతా ప్రభుత్వానికి సహకరించాలని జగన్ సూేచించారు. మీరు అలా ఆలోచించండి.. మేము మీకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వడంపై ఆలోచిస్తామని హామీ ఇచ్చారు.
తాను ఉద్యోగస్తుల కుటుంబంలో ఒకడిని అని.. అదే నమ్మకంతో భరోసా ఇస్తున్నానని తెలిపారు. రెండు మూడు రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తానని తెలిపారు. ఉద్యోగులు చెప్పిన ఇతర అంశాలపై చర్చించి తగిన విధంగా సమస్యలు పరిష్కరిస్తానని ఉద్యోగులంతా ప్రభుత్వంపై పూర్తినమ్మకంతో ఉండాలని జగన్ కోరారు.
ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియజేశానని.. ఈ ప్రభుత్వం మనది అని గుర్తుంచుకొని మోయలేని భారాన్ని మోపకుండా అందరూ కాస్త ఆలోచన చేయాలని జగన్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు అందరిలో సానుకూల దృక్పథంతో ఉండేలా చూడాల్సిన బాద్యత మీదేనని జగన్ అన్నారు.