Begin typing your search above and press return to search.

ఫోకస్ విశాఖ ... జగన్ ప్లాన్ ఏంటి... ?

By:  Tupaki Desk   |   10 Feb 2022 9:00 PM IST
ఫోకస్ విశాఖ ... జగన్ ప్లాన్ ఏంటి... ?
X
విశాఖ మహా నగరం. ఇందులో రెండవ మాటకు తావు లేదు. విశాఖ ఏపీకి మిగిలిన అతి పెద్ద వర్గంగా కూడా చూడాలి. ఆసియా ఖండంలోనే అత్యంగ వేగంగా విశాఖ అభివృద్ధి చెందుతోంది. దీని వెనక పాలకుల కృషి కంటే విశాఖ సొంత ప్రతిభే ఎక్కువ. విశాఖ ఉమ్మడి ఏపీలో కూడా ఎపుడూ చర్చగా ఉండేది. నిజానికి అప్పట్లో హైదారాబాద్ తరువాత స్థానం కూడా విశాఖదే.

అంత వరకూ ఎందుకు. తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా ఉద్యమకారులు ఏపీ జనాలకు హైదారాబాద్ సరిసాటి నగరంగా విశాఖ ఉంది అనేవారు. నిజానికి విశాఖ అలాగే అవుతుంది అని అంతా అనుకున్నారు. చంద్రబాబు విభజన ఏపీకి తొలి సీఎం అయ్యాక విశాఖలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. నాడే విశాఖ రాజధాని మీద అందరికీ ఆశలు పెరిగాయి.

ఇక విశాఖలోనే జాతీయ అంతర్జాయీత సదస్సులు ఎన్నో చంద్రబాబు నాడు సీఎం హోదాలో నిర్వహించారు. ఒక విధంగా చెప్పాలంటే నాడు చంద్రబాబు అయినా నేడు జగన్ అయినా అన్ని విషయాల్లోనూ విశాఖ జపమే చేశారు. ఇక జగన్ అయితే విశాఖ రాజధాని అంటున్నారు. విశాఖను ఆయన బెంగుళూరు, హైదరాబాద్ , చెన్నైల సరిసాటిగా పోల్చుతున్నారు.

ఈ మహా నగరాలతో సమానంగా విశాఖ ఎదుగుతుంది అన్నది జగన్ ఆలోచన. అందుకే రాజధానిగా విశాఖను చేసుకుంటే ఏపీకి గ్రోత్ ఇంజన్ గా మారుతుందని కూడా చూశారు. అయితే మూడు రాజధానుల అంశం వివాదం కావడంతో ఎటూ అడుగు ముందుకు పడలేదు.

ఇక విశాఖను మరో హైదరాబాద్ గా మార్చాలన్న ఉద్దేశ్యంతోనే జగన్ జూబ్లీ హిల్స్ ప్రష్తావన సినీ ప్రముఖుల భేటీలో తెచ్చారు అని అంటున్నారు. అక్కడ ఉన్న సినీ జనాన్ని విశాఖకు తీసుకురావాలని జగన్ చూస్తున్నట్లుగా ఉంది. ఇక విశాఖలో సినీ ప్రముఖులు స్టూడియోలు కడతామంటే స్థలాలు కూడా ఇస్తామని కూడా జగన్ హామీ ఇచ్చారు.

విశాఖ సినీ పరిశ్రమకు ధీటైన నగరంగా నిలుస్తుందని కూడా జగన్ అంటున్నారు. గతంలో కూడా సినీ ప్రముఖుల భేటీలో జగన్ ఇదే మాట చెప్పారు. ఇక విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దాం, అందరం కలసి చేద్దామని కూడా సీఎం పిలుపు ఇస్తున్నారు.

మరి విశాఖను అంతలా ఫోకస్ చేయడం వెనక ఉద్దెశ్యం ఏంటి అంటే రాజధానిగా ఫ్యూచర్ లో దాన్ని నిలబెట్టాలనుకోవడమే అన్న మాట వినిపిస్తోంది. హైదరాబాద్ లో సినీ పరిశ్రమ ఉంది. హైదారాబాద్ తెలంగాణాకు రాజధాని. అలాగే విశాఖ ఏపీకి రాజధానిగా చేస్తూ సినీ పరిశ్రమను అక్కడ స్థిరపరచాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

నిజంగా సినీ పరిశ్రమ విశాఖకు వస్తే పాలనా రాజధాని కంటే కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. కానీ సినీ ప్రముఖులు దాని మీద ఏమాలోచిస్తారో చూడాలి. ఏది ఏమైనా విశాఖ రాజాధానికి సినీ గ్లామర్ ని కూడా అద్దితే సర్వ జనామోదం లభిస్తుందని జగన్ భావిస్తున్నట్లుగా ఉంది. చూడాలి మరి. ఇది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో.