Begin typing your search above and press return to search.

ఇంటింటికీ స్టిక్క‌ర్లు: ఏపీలో కొత్త ప‌థ‌కం

By:  Tupaki Desk   |   8 Feb 2023 5:00 AM GMT
ఇంటింటికీ స్టిక్క‌ర్లు:  ఏపీలో కొత్త ప‌థ‌కం
X
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం చేస్తున్న ప్ర‌చారం చాల‌ద‌న్న‌ట్టుగా.. కొత్త‌గా మ‌రో ప్ర‌చారం ప్రారంభించ నుంది. ప్ర‌జ‌ల‌కు తామే ల‌బ్ది చేకూరుస్తున్నామ‌ని, గ‌తంలో ఎప్పుడూ.. ఏ ప్ర‌భుత్వం కూడా ఇంత ల‌బ్ధి చేకూర్చ‌లేద‌ని ప‌దే ప‌దే చెబుతున్న వైసీపీ ప్ర‌భుత్వం వ‌లంటీర్ల‌తో ఇప్ప‌టికే ప్ర‌తి రోజూ.. ప్ర‌భుత్వానికి ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. ఇక‌, ఇప్పుడు ఈ నెల 11 నుంచి మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది.

అదే.. ఇంటింటికీ స్టిక్క‌ర్ ప‌థ‌కం. ప్ర‌భుత్వం ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధి పొందుతున్న ప్ర‌తి ఇంటినీ గుర్తించ‌నుం ది. ఆ ఇంటికి.. `మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌` అని రాసి ఉన్న స్టిక్క‌ర్‌ను అంటించ‌నున్నారు. ఇది ఒక‌ర‌కంగా.. మాన‌సికంగా.. ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త వానికి రాష్ట్రంలో గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా అనేక కార్యక్ర‌మాలు చేసింది. అయినా..ఎప్పుడూ ఇలా స్టిక్క‌ర్లు అంటించిన ప‌రిస్థితి లేదు.

అయితే..ఇప్పుడు త‌న‌ను ఎక్క‌డ మ‌రిచిపోతార‌ని అనుకున్నారో.. లేక‌.. తాను ఎంతో చేస్తున్నాన‌ని భావిస్తు న్నారో.. తెలియ‌దు కానీ.. సీఎంజ‌గ‌న్ మాత్రం తాజాగా వలంటీర్ల‌తో ప్ర‌తి రోజూ.. త‌న‌ను గుర్తు చేసుకునే కార్య క్ర‌మాలు ఏవో ఒక‌టి చేస్తూనే ఉన్నారు. ఇక‌, ఇప్పుడు గృహ సార‌థులు అనే కొత్త కాన్సెప్టును తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఇద్ద‌రు సార‌థుల‌ను నియ‌మిస్తున్నారు. దీనిలో తొలివిడ‌త‌.. వీరికి స్టిక్క‌ర్లు అంటించే ప‌నిని అప్ప‌గించ‌నున్నారు.

అయితే.. ల‌బ్ధి దారుల అనుమ‌తి మేరకే ఈ స్టిక్క‌ర్ల‌ను అంటిస్తామ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. కానీ, ఇది ఇలా అమ‌లు జ‌ర‌గ‌ద‌ని.. ల‌బ్ధిదారుల‌కు బెదిరింపులో.. హెచ్చ‌రింపులో చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. స్టిక్క‌ర్ లేక‌పోతే.. ప‌థ‌కాలు ఆపేస్తామ‌ని బెదిరించినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో.. ప్ర‌జ‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.