Begin typing your search above and press return to search.
ఫ్లెక్సీ కడుతూ సీఎం జగన్ క్లాస్ మేట్ మరణం
By: Tupaki Desk | 28 Feb 2020 12:00 PM ISTఏపీ సీఎం జగన్ క్లాస్ మేట్ ఒకరు ఊహించని విధంగా మృత్యువాతపడ్డారు. జగన్‌తో కలిసి చిన్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో చదువుకున్నట్లు చెబుతున్న ఆయన అప్పటి ఫొటోలతో ఫ్లెక్సీలు వేయించి తన ఇంటి ముందు కట్టే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు.
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి కి చెందిన ఏడిద జగదీశ్ (39), ముప్పిడి శ్రీను (42) వైసీపీ అభిమానులు. జగదీశ్, తన చిన్న వయసులో హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్ లో వైఎస్ జగన్ తో కలిసి చదువుకున్నాడు. అప్పడు తాము తీయించుకున్న చిత్రాలు, జగన్ పాదయాత్ర లో పాల్గొన్న చిత్రాలతో కలిపి ఓ భారీ ఫ్లెక్సీని తయారు చేయించి తన ఇంటి ముందు కట్టాలనుకున్నారు.
అలా ఆ ఫ్లెక్సీని తన ఇంటి ముందు కట్టేందుకు శ్రీనుతో కలిసి పైకి ఎక్కాడు. ఆ సమయంలో గాలి అధికంగా వీచడంతో, ఫ్లెక్సీ కాస్తా ఇంటి ముందే ఉన్న విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఫ్లెక్సీని పట్టుకుని ఉన్న ఇద్దరూ షాక్ కు గురయ్యారు. కుటుంబ సభ్యులు, స్థానికులు వారిని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమించడం తో ఇద్దరూ చనిపోయారు.