Begin typing your search above and press return to search.
వైసీపీ వ్యూహం: విపక్షాలు విఫలం.. ఏం జరిగిందంటే!
By: Tupaki Desk | 24 Sept 2020 4:00 PM ISTరాష్ట్రంలో అధికార పార్టీ దూకుడు ముందు విపక్షాలు చేతులు ఎత్తేస్తున్నాయా? పైకి సైలెంట్‌గా ఉంటూనే అధికార పార్టీ వేస్తున్న పాచికలు ప్రతిపక్షాలకు షార్ప్‌గా తగులుతున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితిలో టీడీపీ-బీజేపీలు పరోక్షంగా ఏకమై.. జగన్ సర్కారును ఉక్కిరి బిక్కిరి చేయాలని నిర్ణయించుకున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లిన జగన్‌ను ఇరుకున పెట్టి.. ఆయనతో డిక్లరేషన్‌పై సంతకం చేయించాలని పట్టుబట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు... చిత్తూరులో టీడీపీ శ్రేణులు ఆందోళనలకు కూడా దిగాయి. నిజానికి ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో ఈ పరిణామాలను వైసీపీ ఎలా తట్టుకుంటుందనే భావన సర్వత్రా కనిపించింది.
కానీ, వ్యూహాత్మకంగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు.. ఒక్కసారిగా వివాదాన్ని యూటర్న్ తిప్పాయి. రామజన్మభూమికి మోడీ చేసిన శంకుస్థాపన విషయం గురించి..తిరుమల డిక్లరేషన్ ఎప్పటి నుంచి ఉంది? ఎవరు తెచ్చారు? అనే విషయం దాకా.. నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి. అదే సమయంలో మరో కీలక వ్యాఖ్యకూడా చేశారు నాని. బీజేపీ రాష్ట్ర సారథిగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టిన తర్వాతే.. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ.. వ్యాఖ్యానించారు. ఇది కూడా చర్చకు దారి తీసింది. దీంతో విపక్షాలు అప్పటి వరకు చేసిన డిక్లరేషన్ డిమాండ్.. సహా.. మరిన్ని వాదాలు గాలికి కొట్టుకు పోయాయి.
ఇక, ఇప్పుడు మంత్రి కొడాలి నాని ని మంత్రి వర్గం నుంచి పక్కకు తప్పించాలనే డిమాండ్ తెర మీదికి వచ్చింది. దీంతో పాటు.. అసలు డిక్లరేషన్ ఎప్పుడు వచ్చింది? అనే విషయం పై పండితులు, మేధావులు కూడా చర్చ చేపట్టారు. అదే సమయం లో బీజేపీ లోనే ఓ వర్గం(సోముకు దూరంగా ఉంటున్న వర్గం).. దేవాలయాలపై దాడులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? జగన్ ఏడాది న్నర పాలన లో ఇటీవల కాలంలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అనే కోణం లో ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. ఇది బీజేపీ లోనే అంతర్గత చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఇక, టీడీపీ.. ఈ విషయంలో ఆటలో అరిటిపండు అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి కొడాలి చేసిన వ్యాఖ్యలతో మోడీని సమర్ధిస్తూ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఆయన బీజేపీకి చేరువలోనే ఉన్నారని.. ఆయన ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు ఆయన చుట్టూ చేరాయి. ఇంతా చేస్తే.. తిరుమలకు సీఎం జగన్ వెళ్లడం, పట్టువస్త్రాలు సమర్పించడం.. అంతా సాఫీగా సాగిపోయింది. కానీ, ఎటొచ్చీ.. ఇప్పుడు ప్రతిపక్షాలే డిఫెన్స్‌లో పడ్డాయి!!